Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nimbooz నిమ్మరసమా..? పండ్ల రసమా? సుప్రీంకు పంచాయతీ

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (15:25 IST)
Nimbooz
పెప్సికో సంస్థ వేసవికి 'నింబూజ్' పేరుతో నిమ్మడ్రింకును మార్కెట్లో దించుతుంది. ఇప్పుడు ఈ డ్రింకు పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఈ పానీయం గురించి సుప్రీంకోర్టులో పంచాయతీ జరుగబోతోంది. కొంత మంది దీన్ని నిమ్మరసం అంటుంటే, మరికొందరు దీన్ని పండ్ల రసంగా పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమాధానాన్ని ఇప్పుడు సుప్రీం కోర్టు తేల్చనుంది.
 
ఆరాధనా ఫుడ్స్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ పానీయాన్ని 'పండ్లు గుజ్జు లేదా పండ్ల రసం' గా వర్గీకరించారు. అయితే దీన్ని తయారుచేసిన పెప్సికో సంస్థ మాత్రం కేవలం 'నిమ్మరసం'గా మాత్రమే పిలవాలని కోరుకుంటోంది. 
 
తాజా నివేదికల ప్రకారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను న్యాయమూర్తుల ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్‌లో విచారించనుంది. అది ఏ కేటగిరీ డ్రింకో నిర్ణయించుకున్న తరువాత దానికి విధించాల్సిన ఎక్సైజ్ సుంకాన్ని కూడా నిర్ణయించనున్నారు.
 
2013లో తొలిసారి నింబూజ్‌ను పెప్సికో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎటువంటి ఫిజ్ లేకుండా నిజమైన నిమ్మరసంతో తయారుచేసినట్టు వారు వివరించారు. ఆ తరువాత అది నిమ్మరసమా లేక పండరసమా అనే చర్చ మొదలైంది. 2015 మార్చిలో పిటిషనర్లు నింబూజ్ పై కేసును వేశారు. అప్పట్నించి కేసు నడూస్తూనే ఉంది. ఈ ఏప్రిల్ లో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments