Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీమా పాలసీలకు కూడా ఆధార్ లింకు చేయాల్సిందే...

బీమా పాలసీలకు కూడా ఆధార్ నంబరు లింకు చేయాల్సిందేనంటూ భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టంచేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, రెండో సవరణ-2017 ప్రకారం సాధారణ, జీవిత బీమా పాలసీలకు ఆధ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (11:44 IST)
బీమా పాలసీలకు కూడా ఆధార్ నంబరు లింకు చేయాల్సిందేనంటూ భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టంచేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, రెండో సవరణ-2017 ప్రకారం సాధారణ, జీవిత బీమా పాలసీలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. 
 
ప్రస్తుతం కొత్త పాలసీలకు ఆధార్‌ను అనుసంధానించాల్సి ఉంటుందని, ఆర్థిక సేవలన్నింటికీ పాన్‌/ఫామ్‌ 16తో పాటు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ, గత జూన్‌లో ప్రభుత్వం మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని సవరించింది. ఈ చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తదుపరి ఆదేశాల కోసం వేచి చూడాల్సిన అవసరంలేదని సాధారణ, జీవిత బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ తెలిపింది. 
 
తాజా ఆదేశాల వల్ల స్వల్పకాలం పాటు ఇబ్బందులు తలెత్తినా, దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుందని, మోసాల నివారణ, 'మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధన'ల ఏకీకరణకు ఇది ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి భార్గవ్‌ దాస్‌ గుప్తా తెలిపారు. ఐఆర్డీఏఐ ఆదేశాలు దేశంలో 24 జీవితబీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు (ఆరోగ్యబీమా సంస్థలు సహా) ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments