Webdunia - Bharat's app for daily news and videos

Install App

IRCTC: టికెట్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (17:48 IST)
భారత రైల్వే శాఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీర్ఘకాలంగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణికులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాలి. భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ఇటీవలే కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. 
 
ఇకపై ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా తమ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వెరిఫై తర్వాత మాత్రమే ప్రయాణికులు తమ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకునే వీలుంటుంది. ఇందుకు 50 సెకన్ల నుంచి 60 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.
 
ఆన్‌లైన్ బుకింగ్ ట్రైన్ టికెట్స్ :
IRCTC ద్వారా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులందరూ ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అందుకు ప్రయాణికులు తమ రిజిస్టర్డ్ ఈమెయిల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని వెరిఫై చేసుకున్న తర్వాత మీ రైలు టికెట్ బుకింగ్ ప్రాసెస్ మొదలవుతుంది.
 
వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలానంటే? :
IRCTC పోర్టల్ ద్వారా లాగిన్ కాగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అడుగుతుంది.
రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
కుడివైపు సెక్షన్‌లో వెరిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది.
 
ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోవచ్చు.
ఎడమవైపు భాగంలో Edit ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.
 
అన్ని వివరాలను సమర్పించిన తర్వాత OTP మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు పంపడం జరుగుతుంది.
లేదంటే మీ మెయిల్ ఐడీ ద్వారా కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments