Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీ, జొమోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌ ఒప్పందం.. స్టిక్కర్ మీద క్లిక్ చేసినప్పుడు..?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (19:31 IST)
ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం చిన్న వ్యాపారాలకు చేయూత నివ్వనుంది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చిన్న చిన్న కంపెనీలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమోటోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు  ఏర్పరచుకోనున్నట్లు ప్రకటించింది. 
 
ఫోటో మొసేజింగ్‌ యాప్‌ కూడా దేశంలోని ఆహార పరిశ్రమలకు చెందిన వ్యాపారాలు చేసుకునే వారికి సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే వ్యాపారులు తమ వినియోగదారులకు సన్నిహితంగా ఉండేలా వారి మధ్య మంచి వారధిని ఏర్పాటు చేసేలా కృషి చేయనున్నట్లు తెలిపింది. 
 
ప్రత్యేక స్టిక్కర్లను తయారు చేసి మార్కెట్లో సంస్థలు తమను తాము ప్రమోట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. స్విగ్గీ, జొమోటోలతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని ఫేస్‌బుక్‌ ఇండియా ప్రతినిధి నితిన్‌ చోప్రా ప్రకటించారు.
 
కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో రానున్న స్టిక్కర్లతో వినియోగదారులు పోస్ట్‌ చేసినపుడు తమకు నచ్చిన సంస్థ స్టిక్కర్‌ను పోస్ట్‌లో వాడుకోవచ్చు. దీంతో ఇతరులు ఆ స్టిక్కర్‌ మీద క్లిక్‌ చేసినపుడు స్విగ్గీ లేదా జొమోటో ద్వారా వారు ఆ ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకునే అవకాశం రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments