Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో హైదరాబాద్ బీటెక్ విద్యార్థి పోరాడి గెలిచాడు ఎలా?

ఇండిగో విమాన సంస్థతో ఓ హైదరాబాద్ విద్యార్థి పోరాడి గెలిచాడు. జనవరి 28, 2014న దుబాయ్ వెళ్లేందుకు ఇండిగోలో టికెట్ బుక్ చేశాడు. తనకు సంబంధించిన లగేజ్‌ను ఇండిగో బ్యాగేజ్ సర్వీస్‌కు అప్పగించాడు. ఇందులో లక్

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (16:14 IST)
ఇండిగో విమాన సంస్థతో ఓ హైదరాబాద్ విద్యార్థి పోరాడి గెలిచాడు. జనవరి 28, 2014న దుబాయ్ వెళ్లేందుకు ఇండిగోలో టికెట్ బుక్ చేశాడు. తనకు సంబంధించిన లగేజ్‌ను ఇండిగో బ్యాగేజ్ సర్వీస్‌కు అప్పగించాడు. ఇందులో లక్షకు పైగా విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిపాడు.

అయితే ఇండిగో విమానంలో సదరు స్టూడెంట్ బ్యాగ్ పోయింది. దుబాయ్ చేరుకోగానే తన బ్యాగు పోయిన విషయాన్ని గుర్తించిన విద్యార్థి ఎయిర్‌ఇండిగో యాజమాన్యంపైనా, ఇండిగోపైనా    వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. 
 
అయితే ఇండిగో మాత్రం హైద్రాబాద్‌లో తమ బ్రాంచ్ ఆఫీసే లేదని, తమ కంపెనీ ఇక్కడి పరిధిలోకి రాదని సమాధానమిచ్చింది. ప్రయాణికుల వస్తువులకు ఇండిగో ఎలాంటి బాధ్యత వహించదనే విషయాన్ని గుర్తించాలని సూచించింది. కానీ నైతిక బాధ్యత వహిస్తూ 20వేలు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే నూర్ మహ్మద్ ఇందుకు అంగీకరించలేదు. 
 
అయితే ఈ కేసు విషయంలో తాజాగా ఈ నెల అక్టోబర్ 5న ఫోరం తీర్పును వెలువరిస్తూ ఇండిగోకు మొట్టికాయలు వేసింది. ప్రయాణికులు లగేజ్‌ను తెచ్చుకోవడానికి అనుమతిచ్చిన ఇండిగో, ఆ వస్తువులకు బాధ్యత కూడా వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో దిగొచ్చిన ఇండిగో 70వేలు చెల్లించడానికి అంగీకరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం రికార్డు బద్ధలు.. ఓటీటీ, టీఆర్పీ రేటింగ్స్‌ అదుర్స్

సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి హోలీ న్యూ పోస్టర్‌

మెగాస్టార్ చిరంజీవికి యుకె పార్ల‌మెంట్‌‌లో స‌న్మానం

కిరణ్ అబ్బవరం.. దిల్ రుబా చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments