Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మ నిర్భర్ భారత్ : ఏసీల దిగుమతిపై కేంద్రం నిషేధం

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఆత్మ నిర్భర్ భారత్ అనే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ప్రస్తుతం దేశంలో సగటున 30 శాతం ఏసీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. వీటిని సాధ్యమైనత మేరకు తక్కువ సమయంలోనే దిగుమతి చేసుకునే యూనిట్ల సంఖ్యను తగ్గించుకునేలా ప్రయత్నించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
పైగా, అత్యవసరమైనవి మినహా ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన నరేంద్ర మోడీ సర్కారు ముఖ్యలక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్‌ను ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఏసీలపై ఇదే తరహా నిషేధం విధించారు. దీంతో స్వదేశీ ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments