Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కరెన్సీ నోట్లపై అబ్దుల్ కలాం ఫోటోను ముద్రించాలి : నెటిజన్ల ట్వీట్స్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (15:45 IST)
ఇటీవల అకాలమరణం చెందిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోను భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని నెటిజన్లు భారీ సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు. ఈ మేరకు వారు దేశ కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మా గాంధీ ఫోటో స్థానంలో అబ్దుల్ కలాం ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టారు. పైగా, దేశానికి ఎనలేని సేవలు అందించిన ఈ మిస్సైల్ మ్యాన్‌కు శతకోటి భారతీయులు అందించే నిజమైన నివాళి ఇదేనని నెటిజన్లు పేర్కొంటున్నారు.
 
 
దేశాన్ని ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం పోరాటం చేశారు. ఆ స్థాయిలో జాతిని కల్పించిన మహానేత అబ్దుల్ కలాం మాత్రమేని నెటిజన్లు పేర్కొంటున్నారు. పైగా మూడు దశాబ్దాల నుంచి దేశ ఆధునిక అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా ప్రజల్లో జాతీయవాదాన్ని రగిలించడంలో కలాం ఎంతో కృషి చేశారని వారు కొనియాడుతున్నారు. 
 
అందుకే జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా మహాత్ముడి తర్వాత ఆయనకే దేశమంతా నివాళులర్పించింది. ఆయన అంత్యక్రియల సమయంలో జాతీయ జెండాను భౌతికకాయంపై ఉంచగా, పూర్తి సైనిక లాంఛనాలతో, వేలాది ప్రజలు 'భారత్ మాతా కి జై' అంటూ నినదిస్తుండగా అంత్యక్రియలు జరిగాయి. అంతటి ప్రేమాభిమానాలను అందుకున్న కలాంను... కరెన్సీ నోటుపై చూసుకోవాలనుకునే కోరిక నేటి యువతలో కనిపిస్తోందనడానికి ఇదే నిదర్శనం! 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments