Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా భారత్ పేద దేశమే : ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

వరుణ్
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (22:39 IST)
ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మూడోదిగా నిలిచినప్పటికీ భారతదేశం మాత్రం ఇంకా పేద దేశంగానే ఉందని భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2029 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా అతవరించినప్పటికీ భారత్‌ పేద దేశంగానే ఉండవచ్చన్నారు. అందువల్ల మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించామని సంబరపడిపోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సౌదీ అరేబియాను ప్రస్తావించారు. ధనిక దేశంగా మారినంత మాత్రాన అభివృద్ధి చెందిన దేశంగా చెప్పలేమన్నారు. 'నా దృష్టిలో.. అది సాధ్యమే (మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం). కానీ, అది సంతోష పడాల్సిన విషయం కాదు. ఎందుకంటే.. 140 కోట్ల జనాభా ఉన్నందున మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అందులో ప్రజలు ఒక అంశం మాత్రమే. ప్రజలు ఉన్నారు కాబట్టే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. అయినప్పటికీ పేద దేశమే' అని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.
 
ప్రస్తుతం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందని, ఆర్థికవ్యవస్థ 4ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని సుబ్బారావు తెలిపారు. తలసరి ఆదాయం 2600 డాలర్లుగా ఉందని, ఇందులో భారత్‌ 139వ స్థానంలో ఉందన్నారు. బ్రిక్స్‌, జీ-20 దేశాల్లో పేద దేశంగా నిలుస్తోందన్నారు. ముందుకు వెళ్లేందుకు అజెండా స్పష్టంగా ఉందని, వృద్ధి రేటును పెంచడంతోపాటు ప్రయోజనాలు అందరికీ పంచాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ప్రధాని మోడీ పేర్కొనడాన్ని ప్రస్తావించారు. ఇది సాధించాలంటే స్వతంత్ర సంస్థలు, పారదర్శకత, బలమైన ప్రభుత్వం, చట్టబద్ధమైన పాలన ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ రాబోతుంది

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ బి.బి.ఏ.4 ప్రకటన

కల్కి 2898 AD’ ట్రైలర్ ఫెంటాస్టిక్ - దేశం గర్వించేలా ఉంటుంది: నాగ్ అశ్విన్

హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టు!

శ్రీలీల నాయికగా రవితేజ 75వ చిత్రం - నేటి నుంచే షూటింగ్ షురూ

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments