Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవ‌ర‌న్నారు? పూర్ ఇండియ‌న్స్ అని... భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?

ముంబై: భార‌తదేశంలో కోటీశ్వ‌రుల‌కు కొదవలేదు. ఇది మేం చెప్పే మాట‌లు కాదు... దేశంలో కోటీశ్వరుల సంఖ్యను ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్న వారు 10 శాతం కాగా, రూ.50 లక్షల నుంచి రూ. కోటి మ‌ధ్య సంపాదిస్తున్నవారు 22 శాతంగా ఉన్నట్లు తె

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (13:01 IST)
ముంబై: భార‌తదేశంలో కోటీశ్వ‌రుల‌కు కొదవలేదు. ఇది మేం చెప్పే మాట‌లు కాదు... దేశంలో కోటీశ్వరుల సంఖ్యను ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది. ఏడాదికి రూ.కోటి సంపాదిస్తున్న వారు 10 శాతం కాగా, రూ.50 లక్షల నుంచి రూ. కోటి మ‌ధ్య సంపాదిస్తున్నవారు 22 శాతంగా ఉన్నట్లు తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఆధారంగా ఈ గణాంకాలను విడుదల చేసింది.
 
ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో 45,027 మంది స్థూల ఆదాయం రూ.కోటి నుంచి రూ.5 కోట్లు ఉండగా, 98,815 మంది ఆదాయం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో సుమారు 3 వేల మంది వార్షికాదాయం రూ.5 కోట్లు పైబడి ఉండటం విశేషం. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే భారతీయుల ఆదాయం భారీగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో కోటీశ్వర్ల సంఖ్య 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా.
 
ఇక మ‌న దేశంలో వివిధ కంపెనీల సీఈవోలు ఒక రేంజ్‌లో సంపాదిస్తున్నారు. వీరు ఒక దగ్గర్నుంచి వేరే చోటకు మారడం వల్ల భారీగా వేతనాలు పెరిగాయని విశ్లేషిస్తున్నారు. వేతనాల పెరగడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతోంది. ఈ తాజా లెక్క‌ల ప్రకారం.. భార‌త‌దేశంలో కోటీశ్వ‌రులు...
 
* వేతనం ద్వారా ఏడాదికి రూ. 50 లక్షల నుంచి రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 54,921 
* కోటికిపైగా సంపాదిస్తున్న వారి సంఖ్య 24,942 
* దేశంలో 928 మంది రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు జీతం పొందుతుండగా.. 232 మంది రూ.10 కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు సంపాదిస్తున్నారు. 
* ఏడాదికి రూ.25 నుంచి 50 కోట్లు వరకూ ఆర్జిస్తున్న వారి సంఖ్య 32 
* రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు సంపాదించే వారు పదిమంది ఉండగా.. రూ.100 కోట్ల సంపాదనాపరులు ఇద్దరు ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments