Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనుముకు బదులు ఫైబర్ సిలిండర్లు: ధరెంతో తెలుసా?

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (17:29 IST)
Fiber cylinder
ఇనుముకు బదులు ఫైబర్ సిలిండర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండేన్ సంస్థ. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో జరుగుతున్న ‘గో ఎలక్ట్రిక్ ఎక్స్ పో’లో భాగంగా వీటిని సంస్థ ప్రదర్శించింది ఇండేన్. బుక్ చేసుకున్న గంటల్లోనే ఇంటికి పంపిస్తామని ఇండేన్ అధికారులు తెలిపారు. పది కిలోల సిలిండర్‌లో రూ.670, ఐదు కిలోల సిలిండర్‌లో రూ.330 పెట్టి గ్యాస్‌ను నింపుకోవచ్చని తెలిపారు. 
 
ప్రస్తుతం వాడే సిలిండర్లలో గ్యాస్ బరువు 14.2 కిలోలు. 14.2 కిలోల సిలిండర్ బరువు ప్రస్తుతం ఇనుము కావడంతో 16 కిలోల వరకు వుంటుంది. వీటికి బదులుగానే ఫైబర్ సిలిండర్లను ఇండేన్ తీసుకొచ్చింది. 
 
అయితే, ప్రస్తుతానికి 10 కిలోలు, ఐదు కిలోల సిలిండర్లనే తెచ్చింది. వాటి ధర కూడా ఎక్కువే. 10 కిలోల ఫైబర్ సిలిండర్ కు రూ.3,350 కాగా.. ఐదు కిలోల సిలిండర్ ధర రూ.2,150గా ఉంది. కావాలనుకునేవారు ఇప్పటికే ఉన్న సిలిండర్లను ఇచ్చేసి ఈ సిలిండర్లను మార్చుకోవచ్చని ఇండేన్ సంస్థ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments