Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే..?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (19:03 IST)
పాన్-ఆధార్ అనుసంధానానికి జూన్ 30 చివరి తేదీ అని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్ నంబర్‌ను 30.06.2023న లేదా అంతకు ముందు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. 
 
నిర్దిష్ట తేదీలోగా తమ ఆధార్- పాన్‌లను లింక్ చేయకుంటే పన్ను చెల్లింపుదారులు ఎదుర్కోవాల్సిన శిక్షా చర్యలను కూడా దానితోపాటు ఉన్న నోటిఫికేషన్‌లో ఆదాయ పన్ను శాఖ వివరించింది. 
 
జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, పాన్ డీయాక్టివేట్ చేయబడుతుంది. అందువల్ల పన్ను మినహాయింపు (TDS), పన్ను వసూలు (TCS) రెండూ తీసివేయబడతాయి.
 
పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు, వాపసులపై వడ్డీ కూడా మంజూరు చేయబడదు. దీంతో పాటు పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేస్తే జరిమానాను పెంచనున్నట్లు తెలిసింది. 
 
ఆధార్‌తో లింక్ చేయకుండా పాన్‌ను ఉపయోగించినందుకు రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి, ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments