Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్ మంత్రి సురేష్ ప్రభు కలల రైలు 'హమ్‌సఫర్'.. ప్రత్యేకతలివే...

కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు కలల రైల్ త్వరలో పట్టాలెక్కనుంది. హమ్‌సఫర్ పేరుతో నడిచే ఈ రైలు సేవలు అక్టోబరు నుంచి అందుబాటులోకి రానున్నాయి. బయలుదేరే స్థానం నుంచి గమ్యస్థానానికి కేవలం 12 గంటల వ్యవధిలో

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (14:08 IST)
కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు కలల రైల్ త్వరలో పట్టాలెక్కనుంది. హమ్‌సఫర్ పేరుతో నడిచే ఈ రైలు సేవలు అక్టోబరు నుంచి అందుబాటులోకి రానున్నాయి. బయలుదేరే స్థానం నుంచి గమ్యస్థానానికి కేవలం 12 గంటల వ్యవధిలో అంటే ఒక్క రాత్రి ఎక్కి... మరుసటి రోజు ఉదయం దిగేలా ఈ రైళ్లను నడుపనున్నారు. బోగీలన్నీ థర్డ్ ఏసీ కోచ్‌లే ఉంటాయి. ఈ రైళ్ళలో పలు సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించనున్నారు. 
 
ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్ ఆధారిత పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైర్, స్మోక్ డిటెక్షన్ సిస్టమ్, ప్రతి బెర్తుకు మొబైల్, ల్యాప్ టాప్ చార్జింగ్ పాయింట్లు, మహరాజా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వాడే వినైల్ షీట్లు, సరికొత్త ఇంటీరియర్, అంధులకు సహాయంగా ఉండేలా బ్రెయిలీ డిస్ ప్లే తదితర సౌకర్యాలుంటాయని వివరించారు. 
 
అయితే ఈ రైళ్ళలో ప్రయాణించాలనుకున్న ప్రయాణికులు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో వసూలు చేస్తున్న చార్జీల కంటే 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా రైలును తొలుత న్యూఢిల్లీ - గోరఖ్‌పూర్ మార్గంలో ప్రవేశపెట్టనున్నట్టు రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments