Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోండా నుండి త్వరలో మరో స్పోర్ట్స్ బైక్ విడుదల

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:27 IST)
ప్రముఖ మోటర్‌సైకిల్ బ్రాండ్ హోండా నుండి త్వరలో మరో స్పోర్ట్స్ బైక్ విడుదల కానుంది. సీబీఆర్ 650ఆర్ పేరుతో మరో స్పోర్ట్స్ బైక్‌ని తీసుకురానుంది. ఈ బైక్‌కి సంబంధించి హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ముందస్తు బుకింగ్‌లను విడుదల చేసింది. దీని ధర రూ.8 లక్షలలోపు ఉండే అవకాశం ఉంది. మిలాన్‌లో జరిగిన 2018 ఈఐసీఎంఏ షోలో ఈ బైక్‌ని ఆవిష్కరించారు. 
 
2019లో విడుదల చేయనున్న మోడళ్లను ఈఐసీఎంఏ షోలో ప్రదర్శించారు. భారత్‌లో ఇప్పుడు సీబీఆర్‌ 650ఆర్‌ బుకింగ్‌లు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు (అమ్మకాలు, మార్కెటింగ్‌) యద్వింధర్‌ సింగ్‌ గులేరియా పేర్కొన్నారు. సీబీఆర్‌ 650ఎఫ్‌ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త సీబీఆర్ 650ఆర్‌ బైకులో 649సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఫోర్‌-సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. 
 
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. పాత మోడళ్లతో పోల్చితే ఛాసిస్ బరువు 6 కేజీలు తక్కువని కంపెనీ తెలిపింది. 22 నగరాల్లో కొత్త సీబీఆర్‌ 650ఆర్ బైక్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.15,000 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని హోండా సంస్థ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments