Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్.ఎం.టీ ప్లాంట్‌‌కు మళ్లీ మహర్ధశ.. ప్లాంట్ పునఃప్రారంభం!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (16:54 IST)
దేశీయ వాచీల తయారీలో తొలి కంపెనీగా ఖ్యాతిగడించిన హెఎచ్ఎంటీ ప్లాంట్లను మూసి వేసిన విషయం తెల్సిందే. అయితే, కేంద్రం మాత్రం ఈ మూసేసిన ప్లాంట్లలో కనీసం ఒక్కదాన్నైనా తిరిగి ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది. ఇది హెచ్ఎంటీ కంపెనీకి కొత్తగా ప్రాణం లేచి వచ్చినట్లైంది. అయితే ఎక్కడి ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలన్న దానిపై కేంద్రం ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. 
 
పెద్ద మొత్తంలో నష్టాలను కూడగట్టుకున్న హెచ్ఎంటీని మూసివేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు సదరు నిర్ణయాన్ని అమలు చేసేసిన ప్రభుత్వం, తాజాగా ఈ కొత్త నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై ఆసక్తికర అంశం దాగుంది. హెచ్ఎంటీ కంపెనీని మూసివేస్తున్నట్లుగా వెలువడిన వార్తల నేపథ్యంలో సదరు కంపెనీ రూపొందించిన వాచీలకు భారీ డిమాండ్ వచ్చేసింది. 
 
అప్పటిదాకా ఉన్న రేటుకు రెట్టింపు రేటు పెట్టినా, కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకాడలేదు. దీంతో చివరి కలెక్షన్ పేరిట కంపెనీ విడుదల చేసిన వాచీలు, మార్కెట్‌లోకి విడుదలయ్యాయో లేదో, ఇట్టే అయిపోయాయి. దీనిని గమనించిన నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే, వినియోగదారుల్లో తనకున్న డిమాండ్‌తోనే హెచ్ఎంటీ మళ్లీ జీవం నింపుకున్నదన్నమాట. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments