Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలం సమీపిస్తోన్న వేళ హీటింగ్‌ అప్లయెన్సస్‌ పరిచయం చేసిన హింద్‌వేర్‌ స్మార్ట్‌ అప్లయెన్సస్‌

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:41 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ కన్స్యూమర్‌ అప్లయెన్సస్‌ బ్రాండ్‌ హింద్‌వేర్‌ స్మార్ట్‌ అప్లయెన్సస్‌ ఇటీవలే తమ శ్రేణి ఉత్పత్తులను తమ వాటర్‌ హీటర్‌, రూమ్‌ హీటర్స్‌ విభాగంలో విడుదల చేసింది. తద్వారా తమ ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసేకోవడంతో పాటుగా ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌ లైన మార్కెటలలో తమ  మార్కెట్‌  స్థానాన్ని పునరుద్ఘాటించనుంది.
 
నూతన ఆవిష్కరణలలో, హింద్‌వేర్‌ క్వీక్‌ పోర్టబల్‌ వాటర్‌ హీటర్‌ ఉంది. ఇది వినియోగదారులకు అత్యున్నత స్థాయి ఫీచర్లను అందిస్తుంది. ఈ వాటర్‌ హీటర్‌లో అత్యున్నతస్థాయి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో పేటెంటెడ్‌ సూపర్‌ సేఫ్‌ ఇన్నోవేటివ్‌ షీల్డ్‌ డిజైన్‌; బర్న్‌/ఫైర్‌ ప్రొటెక్షన్‌; ఐపీఎక్స్‌ 7 సర్టిఫైడ్‌ షాకింగ్‌ ఫ్రూఫ్‌, ఆటో-కట్‌ ఆఫ్‌ ఫీచర్‌, ఓవర్‌ హీటింగ్‌ ప్రొటెక్షన్‌ ఉన్నాయి. సౌకర్యవంతంగా వినియోగించుకునేందుకు ఇది కార్డ్‌హోల్డ్‌ర్‌తో వస్తుంది, యూనిఫార్మ్‌ స్టాండలోన్‌ హీటింగ్‌ అందిస్తుంది.
 
ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా ట్యాంక్‌లెస్‌ వాటర్‌ హీటర్‌ శ్రేణిని రెండు నూతన మోడల్స్‌-హింద్‌వేర్‌ స్ట్రామ్‌, హింద్‌వేర్‌ విజ్‌ విడుదల చేసింది. ఇన్‌స్టెంట్‌ హీటింగ్‌తో కేవలం 5 సెకన్లలో వేడి నీరు అందిస్తుంది. ఈ మోడల్స్‌ విద్యుత్‌ ఆదా చేయడంతో పాటుగా యాంటీ స్కేలింగ్‌ ఫీచర్స్‌తో వస్తాయి. హింద్‌వేర్‌ స్ట్రామ్‌ వాటర్‌ హీటర్‌  భారతదేశం వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ స్టోర్ల వ్యాప్తంగా లభ్యమవుతుంటే; హింద్‌వేర్‌ విజ్‌ను ప్రత్యేకంగా ఈ-రిటైల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కోసం విడుదల చేశారు. ఈ ట్యాంక్‌లెస్‌ వాటర్‌ హీటర్లు జకుజ్జీతో కూడిన బాత్‌రూమ్‌లకు అత్యుత్తమంగా సరిపోతాయి. అలాగే బాత్‌రూమ్‌లలో స్పేస్‌ తక్కువగా ఉన్నచోట కూడా చక్కగా సరిపోతాయి.
 
ఈ నూతన  ఆవిష్కరణలను గురించి  హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ సీఈఓ, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ శ్రీ రాకేష్‌ కౌల్‌ మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందించాలనే లక్ష్యంతో మేము వినూత్నమైన ఉత్పత్తులను వారి డిమాండ్‌లకు అనుగుణంగా అందిస్తుంటాము. ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్‌ అట్లాంటిక్‌ తో మా భాగస్వామ్యం కారణంగా మా అప్లయెన్సస్‌ అన్నీ కూడా అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటంతో పాటుగా అంతర్జాతీయ  నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉంటాయి’’ అని అన్నారు.
 
ఈ పోర్ట్‌ఫోలియోకు మొత్తంమీద 20 నూతన ఎస్‌కెయులను జోడించారు. స్క్వేర్‌ మోల్డ్‌ స్టోరేజీలో రెండు నూతన స్టోరేజీ వాటర్‌ హీటర్లలో హింద్‌వేర్‌ అమోలియో, అవిలియో ఉన్నాయి. ఇవి అత్యంత ఆకర్షణీయంగా రెడ్‌, బ్లూ, గ్రే రంగుల్లో లభిస్తాయి.  రెక్టాంగ్యులర్‌ క్యూబాయిడ్‌  విభాగంలో హింద్‌వేర్‌ నైట్రో ఉంది. ఇది అత్యున్నత భద్రతా ఫీచర్లు అయిన గ్లాస్‌లైన్‌ ట్యాంక్‌, కాపర్‌ హీటింగ్‌  ఎలిమెంట్‌ను సుదీర్ఘ మన్నిక కోసం కలిగి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments