Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆ రెండూ లేకుంటే ఏం.. అసలుది మరొకటుంది కదా అంటున్న ఎన్ఆర్ఐ

సంపన్న దేశాల వద్ద ఉన్న డబ్బులు కానీ, నైపుణ్యం కానీ భారత్ వద్ద లేకపోవచ్చు కానీ ఆ రెండింటి అవసరం పుల్లుగా తీర్చే అవకాశం భారత్ వద్ద ఉందని ప్రముఖ ప్రవాస భారతీయుడు జీపీ హిందూజా పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా తన పెట్టుబడిని, తన నైపుణ్యాన్ని పూర్తిస్థాయి

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (06:35 IST)
సంపన్న దేశాల వద్ద ఉన్న డబ్బులు కానీ, నైపుణ్యం కానీ భారత్ వద్ద లేకపోవచ్చు కానీ ఆ రెండింటి అవసరం పుల్లుగా తీర్చే అవకాశం భారత్ వద్ద ఉందని ప్రముఖ ప్రవాస భారతీయుడు జీపీ హిందూజా పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా తన పెట్టుబడిని, తన నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలంటే అందుకు ఏకైక వనరు భారత దేశమేనని ఆయన చెప్పారు. అందుకోసమే చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ భారత్‌తో కలిసి పని చేయాలని హిందూజా పిలుపునిచ్చారు.
 
ప్రపంచంలో కేవలం భారత్‌లో మాత్రమే పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ ఎంట్రప్రెన్యూర్‌ జీపీ హిందూజా అభిప్రాయపడ్డారు. ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించి చైనా, ఇండియా, యూకేల మధ్య ఒక త్రైపాక్షిక భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ‘చైనీయుల వద్ద డబ్బులున్నాయి. బ్రిటన్‌ వారి వద్ద నైపుణ్యత ఉంది. భారత్, చైనా, యూకే మధ్య ఒక త్రైపాక్షిక భాగస్వామ్యం అవసరం. దీనిపై ఆయా దేశాల ప్రభుత్వాలు కృషిచేయాలి’ అని హిందూజ గ్రూప్‌ కో–చైర్మన్‌ జీపీ హిందూజా గురువారం రాత్రి చైనా బిలియనీర్లు, బ్రిటిష్‌ ప్రభుత్వపు ప్రతినిధులతో నిర్వహించిన ఒక సమావేశంలో పేర్కొన్నారు.
 
భారత్ వద్ద పెట్టుబడులు, నైపుణ్యం రెండూ లేవని సుతిమెత్తగా తెలిపిన హిందుజా లాభాల పంట పండాలంటే మాత్రం భారత్ లోనే అవకాశాల గనులున్నాయని స్పష్టం చేశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments