Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ ఎఫెక్ట్ : ఏప్రిల్ 1 నుంచి ధరల మోత.. ఆ వస్తువులివే...

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆఖరుకు ఇడ్లీపై కూడా పన్ను వసూలు చేస్తున్నారు. ఒక్క ఇడ్లీ ఏంటి.. అన్ని రకాల తినుబండరాలపై జీఎస్టీ భారం మోపారు. ఈ నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం ఏ

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (09:16 IST)
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆఖరుకు ఇడ్లీపై కూడా పన్ను వసూలు చేస్తున్నారు. ఒక్క ఇడ్లీ ఏంటి.. అన్ని రకాల తినుబండరాలపై జీఎస్టీ భారం మోపారు. ఈ నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకాబోతోంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రోజువారీ వస్తువులు మీ ప్యాకెట్‌కు చిల్లు పెట్టబోతున్నాయి. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెండు రూపాయలు తగ్గనున్నాయి. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో వీటి ధరలు తగ్గనున్నాయి. టీవీ ధరల్లో 5 శాతం, మొబైల్‌ ఫోన్లు 5 శాతం, సిల్వర్‌ ధరలు 3 శాతం, ఫుట్‌వేర్‌ ధరలు 5 శాతం, ఫోన్‌ బ్యాటరీ ధరలు 5 శాతం, బంగారం ధరలు 3 శాతం చొప్పున ధరలు పెరగనున్నాయి. ఆ ప్రతిపాదనల మేరకు ధరలు పెరిగే వస్తువుల వివరాలను పరిశీలిస్తే, 
 
కూరగాయలు, పండ్ల రసాలు, ఫుట్‌వేర్‌, కలర్డ్‌ జెమ్స్‌ స్టోన్స్‌, డైమాండ్స్‌, ఇమిటేషన్‌ జువెల్లరీ, స్మార్ట్‌ వాచ్‌లు, వేరబుల్‌ డివైజ్‌లు, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ ప్యానల్స్‌, ఫర్నీచర్‌, దుప్పట్లు, ల్యాంప్‌లు, చేతి గడియారాలు, జేబు గడియారాలు, గోడ గడియారాలు, ట్రైసైకిళ్లు, స్కూటర్లు, పెడల్‌ కార్లు, డాల్స్‌, టోయస్‌, వీడియో గేమ్‌, కన్సోల్స్‌ స్పోర్ట్స్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ పరికరాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, సిగరెట్‌, ఇతర లైటర్లు, క్యాండిల్స్‌, కైట్స్‌, కూరగాయల నూనెలు ఉన్నాయి. 
 
వీటితో పాటు.. కార్లు, మోటార్‌సైకిళ్లు, మొబైల్‌ ఫోన్లు, సిల్వర్‌, గోల్డ్‌, సన్‌గ్లాసస్‌, పర్‌ఫ్యూమ్స్‌, టాయిలెట్‌ వాటర్స్‌, సన్‌స్క్రీన్‌, సన్‌ట్యాన్‌, మానిక్యూర్‌, పెడిక్యూర్‌ ప్రిపరేషన్లు, ప్రిపరేషన్స్‌ ఫర్‌ ఓరల్‌ డెంటర్‌ హైజీన్‌, పౌండర్లు, డెంటల్‌ ఫ్లోస్‌, ట్రక్కు, బస్సు ర్యాడికల్‌ టైర్లు, సిల్క్‌ ఫ్యాబ్రిక్స్‌ ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments