Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారా 10.19 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

ఐవీఆర్
శనివారం, 20 జులై 2024 (22:00 IST)
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలపై రూ.945.31 కోట్లు ఖర్చు చేశానని, ఆ ఏడాదికి సంబంధించిన సమగ్ర వార్షిక నివేదికలో పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ.125 కోట్లు పెరిగింది. తన సీఎస్‌ఆర్ బ్రాండ్, పరివర్తన్ కింద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్యక్రమాలు ఇప్పటివరకు 10.19 కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశాయి. అవి 9,000 గ్రామాలోని, 10 లక్షలకు పైగా కుటుంబాలకు చేరుకుంది. వీటిలో 112 జిల్లాలలో 85 చోట్ల కవరేజీని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ (ADP)లో భారత ప్రభుత్వం గుర్తించింది. అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడంపై దృష్టి సారించిన పరివర్తన్ 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తుంది.
 
ఫోకస్ చేస్తున్న కీలక ప్రాంతాలు
గ్రామీణాభివృద్ధి: బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలలో సహజ వనరుల నిర్వహణ, పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేద్యానికి మద్దతు, నేల, నీటి సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు, తన సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం మరియు కేంద్రీకృత అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామీణ భారతదేశంలో జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ 9000 గ్రామాలను కవర్ చేసింది.
 
విద్యను ప్రోత్సహించడం: ఉపాధ్యాయులకు శిక్షణ, స్కాలర్‌షిప్‌లు, కెరీర్ గైడెన్స్, పాఠశాలలకు మౌలిక సదుపాయాల మద్దతు ద్వారా విద్యా నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించే కార్యక్రమాల కోసం బ్యాంక్ ఇప్పటి వరకు 2 కోట్ల మంది విద్యార్థులకు చేరువైంది.
 
నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి అవకాశాల వృద్ధి: వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఉపాధిని మెరుగుపరచడం, స్థిరమైన జీవనోపాధిని సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ 9 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను సృష్టించి, 3 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చింది.
 
ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత: మార్చి 31, 2024 వరకు నిర్వహించిన ఆరోగ్య శిబిరాల నుండి 1.87 లక్షల మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు. ఆరోగ్య శిబిరాలు, మొబైల్ క్లినిక్‌లు, పారిశుద్ధ్య ప్రాజెక్టులు ఆరోగ్య సంరక్షణ అవసరాలను పరిష్కరిస్తాయి. వెనుకబడిన వర్గాలలో పరిశుభ్రత పద్ధతులను ప్రోత్సహిస్తాయి.
 
ఆర్థిక సాక్షరత: ఆర్థిక సాక్షరత శిబిరాలు, వర్క్‌షాప్‌లు ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి బ్యాంకింగ్, పొదుపులు, ఆర్థిక ప్రణాళికలపై వ్యక్తులకు అవగాహన కల్పిస్తాయి. బ్యాంకు 23 లక్షలకు పైగా ఆర్థిక సాక్షరత శిబిరాలను నిర్వహించి, ఈ కార్యక్రమాల ద్వారా 1.71 కోట్ల మందికి చేరువైంది.
 
పర్యావరణం: పర్యావరణ కార్యక్రమాలలో అడవుల పెంపకం, చెట్ల పెంపకం, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, వ్యర్థాల నిర్వహణ వంటివి స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి, కార్బన్ పాదముద్రను తగ్గించడానికి ఉన్నాయి. రానున్న FY32 నాటికి స్కోప్ 1, స్కోప్ 2 ఉద్గారాల కోసం కార్బన్ న్యూట్రాలిటీని సాధించడానికి బ్యాంక్ కట్టుబడి ఉంది.
 
‘‘ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం నుంచి పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, సామాజిక చేరికను అభివృద్ధి చేయడం వరకు, మా సీఎస్ఆర్ ప్రయత్నాలు మేము సేవలందిస్తున్న సముదాయాలలో శాశ్వతమైన మార్పును సృష్టించేందుకు స్థిరమైన నిబద్ధతతో మార్గనిర్దేశం చేయబడతాయి’’ అని బ్యాంక్ సమగ్ర వార్షిక నివేదిక పేర్కొంది.
 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ కైజాద్ భారుచా మాట్లాడుతూ, “పరివర్తన్ కింద మా సీఎస్‌ఆర్ కార్యక్రమాలు సమగ్ర అభివృద్ధికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న సముదాయాలకు సాధికారత కల్పించడం ద్వారా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని ముందుకు తీసుకువెళడమే మా లక్ష్యం. గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యం పెంపుదల, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక అక్షరాస్యత, పర్యావరణం వంటి క్లిష్టమైన రంగాలను పరిష్కరించడం ద్వారా, మేము సేవలు అందిస్తున్న సముదాయాలలో స్థిరమైన, సమగ్ర అభివృద్ధిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని తెలిపారు. భరుచా తన ఇతర బాధ్యతలతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG) విధులను కూడా నిర్వహిస్తున్నారు.
 
భాగస్వామ్య, బాటమ్-అప్, సంప్రదింపుల విధానం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దాని లక్ష్య లబ్ధిదారుల నిర్దిష్ట అవసరాలు, పరిస్థితులను పరిష్కరించే ప్రోగ్రామ్‌లకు సహాయపడుతుంది. బ్యాంక్ తన స్థిరమైన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి ఎన్‌జీఓలు, భాగస్వాములు, ఉద్యోగుల వాలంటీర్ల విస్తృత నెట్‌వర్క్‌తో సహకరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments