Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ: 66 వస్తువులపై పన్ను రేట్లు తగ్గింపు.. రూ.100 కంటే తక్కువ ఉన్న సినిమా టిక్కెట్లపై?

వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) పదహారవ సమావేశం వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పరిశ్రమలో కీల

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (10:19 IST)
వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) పదహారవ సమావేశం వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పరిశ్రమలో కీలక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పన్ను శాతాన్ని సవరించామని తెలిపారు. ఈ క్రమంలో 66 వస్తువులపై పన్ను రేట్లను సవరించామని తెలిపారు. 
 
జీడిపప్పుపై 12 నుంచి 5 వరకు, ప్యాకింగ్‌ చేసిన ఆహారం, పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, టాపింగ్స్‌, ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌, సాస్‌లపై 18 నుంచి 12శాతం,  స్కూల్‌ బ్యాగ్స్‌ 28 నుంచి 18శాతం, ఎక్సర్‌సైజ్‌ బుక్స్‌ 18 నుంచి 12శాతం, కలరింగ్‌ బుక్స్‌ 12 నుంచి 0శాతం, అగర్‌బత్తీలపై 12 నుంచి 5శాతం, డెంటల్‌ వాక్స్‌ 28 నుంచి 8 శాతం, ఇన్సులిన్‌ 12 నుంచి 5శాతం, ప్లాస్టిక్‌ బెడ్స్‌ 28 నుంచి 18 శాతం తగ్గించినట్లు జైట్లీ ప్రకటించారు. ఇంకా ప్రీకాస్ట్‌ కాన్సన్‌ట్రేట్‌ పైపులు 28 నుంచి 18శాతం,  స్పూన్లు, ఫోర్క్‌లు (కట్లరీ) 18 నుంచి 12శాతం, ట్రాక్టరు విడిభాగాలపై 28 నుంచి 18శాతం, కంప్యూటర్‌ ప్రింటర్లపై 28 నుంచి 18 శాతం తగ్గించారు. 
 
ఇక సినిమాలపై 28శాతం పన్ను విధించడంతో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మధ్యే మార్గాన్ని ఎంచుకుంది. రూ.100 కంటే తక్కువ ఉన్న టిక్కెట్ల పన్ను శాతాన్ని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ.100 దాటిన టికెట్లపై మాత్రం 28శాతం పన్ను కొనసాగుతుంది. చాలా రాష్ట్రాలు తమ ప్రాంతానికి చెందిన భాషల్లో తీసిన సినిమాకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఇప్పుడు వాటికి కేంద్రం నుంచి ఎటువంటి మినహాయింపు ఉండదు. రాష్ట్రాలు డైరెక్ట్‌ బెన్ఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇవ్వాలనుకుంటే ఆ రాష్ట్రాలే స్థానిక చిత్రాలకు జీఎస్టీని రిఫండ్‌ చేయాల్సి ఉంటుందని అని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments