Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌లో గూగుల్ భారీ పెట్టుబడి.. సేమ్ డే సేల్ కూడా మొదలు

సెల్వి
శనివారం, 25 మే 2024 (12:19 IST)
గూగుల్ సంస్థ వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు $350 మిలియన్లను పెట్టుబడి పెట్టింది. స్వదేశీ కంపెనీ విలువను దాదాపు $36 బిలియన్లకు తీసుకుంది. 
 
వాల్‌మార్ట్ నేతృత్వంలోని తాజా నిధుల రౌండ్‌లో భాగంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్‌ను "మైనారిటీ పెట్టుబడిదారు"గా చేర్చినట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆర్థిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. 
 
భారతీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ చర్య సదరు సంస్థ వ్యాపారాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. 
 
Flipkart తన వ్యాపారాన్ని విస్తరించేందుకు, దేశవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించేందుకు దాని డిజిటల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి గూగుల్‌తో చేతులు కలపడం శుభ పరిణామం అని పేర్కొంది. 
 
2007లో స్థాపించబడిన ఫ్లిప్‌కార్ట్ లక్షలాది మంది విక్రేతలు, వ్యాపారులు, చిన్న వ్యాపారాలను భారతదేశ డిజిటల్ వాణిజ్య విప్లవంలో పాల్గొనేలా చేసింది. ప్రస్తుతం, ఇది 500 మిలియన్ల కంటే ఎక్కువ నమోదిత వినియోగదారుని కలిగి ఉంది. మార్కెట్‌ప్లేస్ 80 కంటే ఎక్కువ వర్గాలలో 150 మిలియన్లకు పైగా ఉత్పత్తులను అందిస్తుంది.
 
ఇంకా ఫ్లిఫ్ కార్ట్ తాజాగా సేమ్ డే డెలివరీని అందుబాటులోకి తెచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులను బుక్ చేసిన రోజునే కస్టమర్లకు అందించనుంది. దేశంలో ఎంపిక చేసిన 20 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించింది. దేశంలో ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న నెలల్లో దేశంలోని మరిన్ని నగరాలకు ఈ సేవలను ఫ్లిఫ్ కార్ట్ తీసుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments