దేశవ్యాప్తంగా భారీగా పసిడి తగ్గిన ధరలు

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:24 IST)
దేశంలో బంగారం, పసిడి ధరలు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. బులియన్ మార్కెట్‌లో ఒక రోజు ధరలు తగ్గితే.. మరో రోజు పెరుగుతుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా బంగారం ధరల పెరుగుదల కనిపించారు. 
 
బులియన్ మార్కెట్‌లో ఒక రోజు ధరలు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు... ఆ తర్వాత స్వల్పంగా దిగివస్తున్నాయి. అందుకే పసిడి ప్రియులు బంగారం ధరల వైపు దృష్టిసారిస్తుంటారు. 
 
తాజాగా పసిడి ధరలు తగ్గాయి. దేశీయంగా పరిశీలిస్తే, మంగళవారం 10 గ్రాముల ధరపై దాదాపు రూ.410 వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రూ.500 వరకు తగ్గింది. 
 
ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 45,280 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 46,280 గా ఉంది. అయితే.. ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600లుగా ఉంది.
 
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉంది.
 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments