Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిళ్ల సీజన్.. రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (12:04 IST)
దేశ వ్యాప్తంగా పెళ్ళిళ్లు, పండగ సీజన్ మొదలైంది. దీంతో బంగారం విక్రయాలు భారీగా సాగుతున్నాయి. ఫలితంగా గత ఆగస్టు నెలలో ఏకంగా రికార్డు స్థాయిలో బంగారు దిగుమతులు జరిగాయి. ఈ ఒక్క నెలలోనే 10.06 బిలియన్ డాలర్లకు చేరిన బంగారం దిగుమతులు జరిగాయి. గత యేడాది ఆగస్టు నెలలో 4.93 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు జరిగాయి. 
 
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలను అరికట్టేందుకు కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించినట్లు పేర్కొన్నట్టు వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్హాల్ వెల్లడించారు. ఒక పక్క కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. మరో పక్క పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి. 
 
వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టులో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నెలలో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లుగా బంగారం దిగుమతులు ఉండగా, ఈ ఏడాది ఆగస్టు రికార్డు స్థాయిలో 10.06 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం.
 
గణనీయంగా బంగారం దిగుమతులు జరగడంపై వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్హాల్ స్పందించారు. బంగారం స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలను అరకట్టేందుకు కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించినట్లు ఆయన తెలిపారు. నగల వ్యాపారులు పండుగ సీజనులో నేపథ్యంలో అమ్మకాల కోసం బంగారాన్ని నిల్వ చేయడం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments