Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు చుక్కలు : మళ్లీ పెట్రో బాదుడు

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (10:25 IST)
దేశంలో చమురు ధరలు వాహనదారులకు పగటిపూటే చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజల్ ధరల బాదుడుకు ఏమాత్రం బ్రేక్ పడటం లేదు. దీంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ ధర సెంచరీ దాటిపోయింది. అయినప్పటికీ.. ధరల బాదుడుకు కేంద్రం కళ్లెం వేయడం లేదు. 
 
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రవాణ ఖర్చులపై పడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.04గా ఉడగా, లీటర్ డీజిల్ ధర రూ. 95.89గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.18గాను, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.01గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ.100.82గా ఉండగా, డీజిల్ ధర రూ.96.62గా ఉంది. 
 
ఇకపోతే, ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.103.65కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.88లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.102.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.14గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.97లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.20గా ఉంది. 
 
ఇకదేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.97.22గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.97లకు లభిస్తోంది. ఇదేసమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.44గా ఉంది. 
 
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.97.12 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ.90.82గాను, చెన్నైలో పెట్రోల్ ధర రూ.98.40 ఉండగా.. డీజిల్ ధర రూ.92.58గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.47 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.93.26గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.60 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.54గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments