Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాపింగ్ మాల్స్, ఐమ్యాక్స్‌ల్లో నిలువుదోపిడీ ఇకనైనా ఆగేనా.. కేంద్రం కొరడా నిజంగానే తగిలేనా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దాని పూర్తి అర్థంలో నిజంగా అమలైతే ప్రేక్షకులను, వినియోగదారులను గుండు కొట్టిస్తున్న బడా షాపింగ్ మాల్స్, వాటిలోని థియేటర్లు చేస్తున్న నిలువుదోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. కేంద్ర వినియోగదారుల వ్యవ

Webdunia
శనివారం, 8 జులై 2017 (07:53 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దాని పూర్తి అర్థంలో నిజంగా అమలైతే ప్రేక్షకులను, వినియోగదారులను గుండు కొట్టిస్తున్న బడా షాపింగ్ మాల్స్, వాటిలోని థియేటర్లు  చేస్తున్న నిలువుదోపిడీకి అడ్డుకట్ట పడినట్లే. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ తాజాగా విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. వచ్చే జనవరి 1 నుంచి విమానాశ్రయాలు, హోటళ్లు, మాల్స్‌ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్నాక్స్, సాఫ్ట్‌ డ్రింక్స్, వాటర్‌ బాటిల్స్‌ మొదలైన వాటిని అధిక రేటుకు విక్రయించడానికి ఉండదు. 
 
మహారాష్ట్ర లీగల్‌ మెట్రోలజీ ఆర్గనైజేషన్‌ (ఎల్‌ఎంవో) విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ద్వంద్వ ఎంఆర్‌పీ విధానాలు పాటించొద్దంటూ కోకకోలా, పెప్సీ, రెడ్‌ బుల్‌ తదితర వినియోగవస్తువుల తయారీ కంపెనీలకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు ఎల్‌ఎంవో కొత్తగా నోటీసులు జారీ చేసింది. శీతల పానీయాలు, స్నాక్స్‌ మొదలైన వాటిని ఎక్కడైనా ఒకే ఎంఆర్‌పీకి విక్రయించాలని, ప్రదేశాన్ని బట్టి అధిక ధరలకు అమ్మరాదని కేంద్రం స్పష్టం చేసింది. 
 
ప్రస్తుతం కిరాణా దుకాణాల్లో మొదలైన వాటిల్లో విక్రయించే స్నాక్స్, సాఫ్ట్‌ డ్రింక్స్‌ లాంటి వాటి రేట్లకు.. మాల్స్, హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లాంటి ప్రదేశాల్లో విక్రయించే ధర మధ్య వ్యత్యాసముంటోంది. ప్రీమియం ప్రదేశాల్లో అమ్మే వాటికి వేరుగా అధిక ఎంఆర్‌పీ ముద్రించి కంపెనీలు సరఫరా చేయడం జరుగుతోంది. ఈ విధానాలు కూడదంటూ గతంలోనూ అనేక సార్లు ఆదేశించినా ఇలాంటి రెండు రకాల ఎంఆర్‌పీ విధానంపై నిర్ధిష్ట చట్టంలో ప్రత్యేక నిబంధనలేమీ లేవంటూ పెద్ద కంపెనీలు కోర్టులకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునేవి.
 
ఈ నేపథ్యంలోనే ఒకే ఉత్పత్తికి రెండు రకాల ఎంఆర్‌పీలు విధించకుండా సదరు చట్టాన్ని ఎల్‌ఎంవో కంట్రోలర్‌ అమితాబ్‌ గుప్తా తెలిపారు. ఒకవేళ కంపెనీలు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే... తమకు ఫిర్యాదు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు. కానీ షాపింగ్ మాల్స్ నిలువుదోపిడీని అరికట్టడానికి ఆరునెలల సమయం తీసుకోవడంలో కేంద్రం మతలబేంటి అనేదే అర్థం కాకుండా ఉంది. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments