Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ బాదుడు - రూ.50 పెంచేసిన కంపెనీలు

Webdunia
బుధవారం, 6 జులై 2022 (10:11 IST)
దేశంలో వంట గ్యాస్ ధరలు మరోమారు భగ్గుమన్నాయి. బుధవారం చడీచప్పుడు కాకుండా 14.2 కిలోగ్రాముల డొమెస్టిక్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్‌కు రూ.50 చొప్పున చమురు కంపెనీలు పెంచేశాయి. 
 
ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు యూనిట్ ధర రూ.1,053కు చేరుకుంది. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5గా ఉంటుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
 
ఇంతకుముందు, దేశీయ సిలిండర్ల ధరలు మే 19, 2022న సవరించారు. మరోవైపు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు బుధవారం నుంచి యూనిట్‌కు రూ.8.5 తగ్గించాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నై వంటి మెట్రోలలో, సిలిండర్ ధర వరుసగా రూ. 2,012.50, రూ. 2,132.00 రూ. 1,972.50, రూ. 2,177.50గా ఉంది. 
 
ఈ నెల 1వతేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినా, బుధవారం నుంచి గృహ అవసరాల గ్యాస్ ధరను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. మార్చి 22న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అంతకుముందు 2021 అక్టోబర్, 2022 ఫిబ్రవరి నెలల మధ్య దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ.899.50గా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments