Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనం డిపాజిట్లపై ఐటీ శాఖ దృష్టి.. కంపెనీలకు నోటీసులు జారీ

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లపై నిషేధం విధించడంతో నల్లధన కుబేరులకు నిద్రపట్టడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నల్లధన రాసులను ఏదో విధంగా తెల్ల ధనంగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (09:18 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లపై నిషేధం విధించడంతో నల్లధన కుబేరులకు నిద్రపట్టడం లేదు. దీంతో తమ వద్ద ఉన్న నల్లధన రాసులను ఏదో విధంగా తెల్ల ధనంగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి వారిలో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకుల్లో అనేక కంపెనీలు డిపాజిట్లు చేశాయి.
 
కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు... బ్యాంకుల్లో రూ.2.5 లక్షలు దాటి డిపాజిట్ చేస్తున్న వారికి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపే ప్రక్రియ ప్రారంభించింది. ఈస్ట్ సిక్కిం, గ్యాంగ్‌టక్ కేంద్ర కార్యాలయంగా సీతారాం ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ఈనెల 13న రూ.4.51లక్షలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కిం శాఖలో డిపాజిట్ చేయడంతో ఇప్పుడు నోటీసులు అందాయి. అంతసొమ్ము డిపాజిట్‌కు సంబంధించి ఆర్థిక వనరులు ఎక్కడివని ఆదాయపన్ను శాఖ ప్రశ్నించింది. 
 
ఈనెల 25న సిలిగురిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలని సీతారాం ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులను ఆదేశించింది. సీతారాం ఎంటర్‌ప్రైజెస్ ఆదాయం పన్ను చెల్లిస్తున్న పక్షంలో గత రెండేళ్ల రిటర్న్స్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఏదేమైనా లెక్కచూపలేని నగదును బ్యాంకుల్లో జమ చేసిన వారికి కష్టాలు తప్పవని ఈ నోటీసుతో అర్థమైపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments