Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్టు.. జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు జమ

దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జన్‌ధన్ ఖాతాలు కళకళలాడిపోతున్నాయి. ఈ ఖాతాల్లోకి గత 13 రోజుల్లో రూ.21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (09:14 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జన్‌ధన్ ఖాతాలు కళకళలాడిపోతున్నాయి. ఈ ఖాతాల్లోకి గత 13 రోజుల్లో రూ.21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. 
 
దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ అయిన రాష్ట్రాల్లో.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ సీఎంగా ఉన్న పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో నిలువగా కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది.
 
కాగా, నవంబర్ 9 నాటికి రూ.25.5 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న రూ.45,636.61 కోట్లు నిల్వ ప్రస్తుతం రూ.66 వేల కోట్లను దాటినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో డిపాజిట్ పరిమితి రూ.50 వేలు. కాగా జన్‌ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరిందన్న వార్తల నేపథ్యంలో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్‌ఐయూ) విచారణ చేపట్టింది. 
 
ఈ విచారణలో పరిమితికి మించి నగదు జమ అయిన ఖాతాదారుల వద్ద ఎఫ్.ఐ.యూతో పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ విచారణలో జమ అయిన నగదు నల్లధనం అని తేలిన పక్షంలో ఆ ఖాతాదారునికి ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలు రద్దు అయ్యే అవకాశం లేకపోలేదు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం