క్రెడిట్ కార్డులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తే అంతే రుణాల ఊబిలో కూరుకుపోతారు. అదేగనుక క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందలేకపోవచ్చు. అందుకే క్రెడిట్ కార్డును ఎలా వాడినా కూడా బిల్లు మాత్రం కరెక్ట్‌గా చెల్లిస్తూ వస్తే ఏం కాదు. లేదంటే ఇబ్బందులు తప్పవు.
క్రెడిట్ కార్డు బిల్లును కరెక్ట్ టైమ్ కట్టకపోతే ఆలస్యమై రుసుము చెల్లించుకోవాలి. లేట్ ఫీజు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌కు జతవుతుంది. అంతేకాకుండా చెల్లించని డబ్బులపై అధిక వడ్డీ పడుతుంది. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అంతేకాకుండా పలు రివార్డులు కూడా కోల్పోవలసి వస్తుంది. మీరు మీ క్రెడిట్ కార్డును బిల్లును చాలా రోజులు అయినా కూడా కట్టకపోతే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కార్డు బిల్లు మొత్తాన్ని చెల్లించకపోవడం 180 రోజులు దాటితే మీ కార్డును బ్లాక్ చేస్తారు. అప్పుడు ఈ విషయం కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ బాగోలేకపోతే భవిష్యత్‌లో ఎలాంటి రుణాలు పొందలేకపోవచ్చు.