Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్... గడువులోగా బిల్లులు చెల్లించకుంటే....?

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (14:41 IST)
అనేక మంది బ్యాంకు ఖాతాదారులు తమ లావాదేవీలను డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల రూపంలోనే చేస్తుంటారు. అయితే, వేలకు వేల రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా వాడేసి.. బిల్లు చెల్లించడంలో విఫలమైతే వడ్డీ మోత మోగనుంది. అందులో బ్యాంకులదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. వడ్డీపై పరిమితి ఉండాలన్న జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. దీంతో నిర్ణీత గడువులోగా బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేసుకొనేందుకు బ్యాంకులకు మార్గం సుగమమైంది. అందువల్ల క్రెడిట్ కార్డు వాడకందారులు సకాలంలో బిల్లు చెల్లించడంపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
క్రెడిట్ కార్డు బిల్లుల ఆలస్య చెల్లింపులపై వార్షికంగా 30 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని ఎన్సీఈడీఆర్ఎసీ 2008లో తీర్పు వెలువరించింది. ఆలస్య చెల్లింపులపై బ్యాంకులు 36 నుంచి 49 శాతం మేర వడ్డీ వసూలు చేస్తుండడంపై ఆవాజ్ ఫౌండేషన్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది. దీనిపై కొన్ని బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తొలుత స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు 2009లో తీర్పుపై స్టే విధించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్ పెడుతూ కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టింది. 30 శాతం పరిమితి వర్తించదని తెలిపింది. 
 
క్రెడిట్ కార్డు అనేది సక్రమంగా వాడుకుంటే.. అది ఇచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడటంతో పాటు మన రోజువారీ ఖర్చులకు కార్డును వాడడం ద్వారా రివార్డు పాయింట్లు కూడా పొందొచ్చు. పైగా మనం వాడుకున్న మొత్తానికి దాదాపు 45 రోజుల వడ్డీ రహిత గడువు కూడా లభిస్తుంది. కాబట్టి గడువులోగా బిల్లు చెల్లిస్తే క్రెడిట్ కార్డుతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే మాత్రం భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వడ్డీ రహిత గడువులోగా నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దివ్వెల మాధురి డ్యాన్స్ వీడియో.. ట్రోల్స్ మొదలు.. (video)

జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదే.. జానీ మాస్టర్ దంపతులు (video)

Little chitti Babu: ఎంత సక్కగున్నావె పాటకు బుడ్డోడి సాంగ్ (video)

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments