Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య 9కి కుదింపు?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (12:19 IST)
సబ్సిడీ కింద ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9కి కుదించాలన్ని యోచనలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సబ్సిడీ దుర్వినియోగం, గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే, సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. 
 
అనుకున్నడే తడవుగా దీనిపై పరిశీలన చేసి అభిప్రాయం చెప్పాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు దీనిపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఇంటికి 9 సబ్సిడీ సిలిండర్ల నిబంధనను సడలించి, 12 కు పెంచాలన్న నాటి యూపీఏ ప్రభుత్వం చర్యతో సిలిండర్ల వినియోగంలో ఒకేసారి 12 శాతం విక్రయాలు పెరిగాయట. 
 
దీంతో సబ్సిడీ అవసరం లేని బడాబాబులు కూడా సబ్సిడీ సిలిండర్లను యథేచ్ఛగా వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో సబ్సిడీ దుర్వినియోగానికి చెక్ పెట్టాలంటే, సబ్సిడీలపై పరిమితి విధించాల్సిందేనని కేంద్రం యోచిస్తోంది. అంటే, సమీప భవిష్యత్తులోనే సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 9కి తగ్గిపోవడం ఖాయమని పెట్రోలియం శాఖ అధికారులు చెపుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments