లాక్‌డౌన్ ఎఫెక్టు : ఈఎంఐలపై ఆర్నెల్లపాటు మారటోరియం విధిస్తారా?

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (12:01 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ఉత్తర కొరియా, రష్యా మినహా మిగిలిన ప్రపంచదేశాలన్నీ ఈ వైరస్ బారిపడ్డాయి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. దెబ్బకు ప్రపంపం గజగజ వణికిపోతోంది. అయితే, కరోనా పుట్టిన వుహాన్ నగరంతో పాటు.. చైనా కూడా ఈ వైరస్ నుంచి బయటపడింది. కానీ, భారత్ సహా మిగిలిన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఈ నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కేవలం అత్యవసర సర్వీసులు, వైద్యసేవలు, మెడికల్, కిరణా షాపులు మినహా మిగిలిన అన్ని సర్వీసులు బంద్ అయ్యాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. చాలా కుటుంబాల్లో రెక్కాడితేగానీ, డొక్కాడని పరిస్థితి ఉంది. అలాగే, ప్రైవేటు కంపెనీల్లో పని చేసే వేతన జీవుల పరిస్థితి కూడా అంతే. అందువల్ల ప్రతి నెలనెలా కట్టాల్సిన ఈఎంఐలతో పాటు.. క్రిడిట్ కార్డు పేమెంట్స్‌పై ఆర్నెల్ల పాటు మారటోరియం విధించాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పైగా, ఈ ఈఎంఐలపై భారతీయ రిజర్వు బ్యాంకుతో పాటు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ మారటోరియం వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments