Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధరలు కావాలనే పెంచుతున్నాం.. బైకులు ఉన్నోళ్లు ఉన్నతశ్రేణి వ్యక్తులు: కేంద్ర మంత్రి

దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలపై రోజువారీ సమీక్షా విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత చమురు కంపెనీలకూ అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫలితంగా గత రెండు నెలల్లో చడీచప్పుడుకాకుండా లీటరు

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (15:07 IST)
దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలపై రోజువారీ సమీక్షా విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత చమురు కంపెనీలకూ అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫలితంగా గత రెండు నెలల్లో చడీచప్పుడుకాకుండా లీటరు పెట్రోల్‌పై ఏకంగా 9 రూపాయలు పెంచాయి. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ అంశం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఈనేపథ్యంలో ఇటీవలే కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేజీ ఆల్ఫోన్స్ జనాగ్రహం మరింత పెరిగేలా వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలను  ఉద్దేశ్యపూర్వకంగానే పెంచుతున్నట్టు చెప్పారు. పైగా, పెట్రోల్ ఎవ‌రు కొంటారు? కార్లు, బైక్‌లు ఉన్న‌వాళ్లే క‌దా. వాళ్లేమీ ఆక‌లితో అల‌మ‌టించ‌డంలేదు. కార్లు-బైక్‌లు కొన్న‌వాళ్లు ఉన్న‌త శ్రేణి వ్య‌క్తులు, వాళ్లు ట్యాక్స్ క‌ట్టాల్సిందే అని, లేదంటే పేద‌ల బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటార‌ని ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. 
 
ఆయన శనివారం తిరువ‌నంత‌పురంలో మీడియాతో మాట్లాడుతూ, పన్ను క‌ట్టే స్థోమత ఉన్న‌వాళ్ల మీదనే ప‌న్ను వ‌సూలు చేస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డాన్ని స‌మ‌ర్థించారు. పైగా, కావాలనే ధరలు పెంచుతున్నట్టు చెప్పారు. పేద‌ల‌కు సాయం చేయాల‌న్న ఉద్దేశంతోనే ట్యాక్స్‌లు వ‌సూలు చేస్తున్నామ‌న్నారు. పన్నుల రూపంలో వచ్చే డబ్బును పేదలకు పక్కాఇళ్లు, మరుగుదొడ్లు, ఇతర మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఉపయోగిస్తామని తెలిపారు. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments