బీఎస్ఎన్ఎల్ న్యూ ప్లాన్... : రూ.1 కే 30 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్

ఠాగూర్
శుక్రవారం, 1 ఆగస్టు 2025 (14:30 IST)
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్‌ఎల్‌) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్‌' పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. ఇందులోభాగంగా కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అపరిమిత సేవలను అందిస్తుంది. ఈ ఆఫర్‌ కొత్త వినియోగదారులకు మాత్రమే! ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన సామాజిక మాధ్యమమైన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. సిమ్‌ కూడా ఫ్రీ. ఈ ఆఫర్‌ ఆగస్టు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్‌ కోసం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ)కు లేదా రిటైలర్‌ను సందర్శించొచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, 4జీ సేవలను విస్తరించడమే లక్ష్యంగా సంస్థ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments