జొమాటో, స్విగ్గీ ఫుడ్ కావాలా నాయనా? GST వడ్డిస్తారు తింటారా?

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (16:36 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 17వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్ల మాదిరిగా పరిగణిస్తూ ఆయా యాప్‌లు సరఫరా చేసే ఆహార పదార్థాలపై 5 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ విషయంపై ఈ జీఎస్టీ మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
 
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో శుక్రవారం జీఎస్టీ మండలి సమావేశంకానుంది. ఇందులోనే, జీఎస్టీ అంశంతో పాటు దాదాపు 50 ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫుడ్‌ డెలివరీ యాప్‌ల సేవలపై జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ మండలి ఆమోదముద్ర వేస్తే ఆయా సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునేందుకు కొంత సమయం ఇస్తారు.
 
రెస్టారెంట్ల స్థానంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఆహార పదార్థాల డెలివరీకిగాను జీఎస్టీని వసూలు చేసి, ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వినియోగదారులపై అదనపు పన్ను భారం ఏమీ పడదు. ఫుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా చిన్నపాటి హోటళ్ల నుంచి కూడా ఆహార పదార్థాలు వినియోగదారులకు అందుతాయి. దీంతో ఆయా హోటళ్లు కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments