Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో పెట్రోల్ హోం డెలివరీకి శ్రీకారం

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (12:47 IST)
ప్రస్తుతం మనకు ఏది కావాలన్నా సరే హోం డెలివరీ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ వంటి అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కిరాణా సరుకులు, ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్‌లు ఉన్నాయి. ఇపుడు కొత్తగా పెట్రోల్ హోం డెలవరీ కోసం ఓ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే, దీన్ని ప్రభుత్వం రంగ పెట్రోల్ సంస్థ అయిన బీపీసీఎల్ ఆవిష్కరించింది. 
 
బీపీసీఎల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటివద్దకే డోర్ డెలివరీ చేస్తామని తెలిపింది. ఈ విధానాన్ని తొలుత ఏపీ ఆర్థిక రాజధాని విజయవాడ నుంచే శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని బీపీసీఎల్ సౌత్ డీజీఎం రాఘవేంద్ర రావు వెల్లడించారు. హోం డెలివరీ చేసే సమయంలో ఫెసో క్యాన్‌తో ఇంధనాన్ని సరఫరా చేస్తామన్నారు. ఇందులో చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. 
 
కాగా, పెట్రోల్ హోం డెలివరీ కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ డీజీఎంలు రాఘవేంద్ర రావు, భాస్కరరావులు మంగళవారం విజయవాడలోని గాంధీ నగర్ పెట్రోల్ బంకు వద్ద లాంఛనంగా ప్రారంభించారు. అలాగే, గాంధీ నగర్ పెట్రోల్ బంకులో సిబ్బంది లేకుండానే స్కాన్ చేసి సెల్ఫ్‌గా పెట్రోల్ నింపుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments