Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసంలో బలీయమైన వృద్ధిని నమోదుచేసిన బంధన్‌ బ్యాంక్‌

Webdunia
శనివారం, 14 మే 2022 (22:58 IST)
సమ్మిళిత బ్యాంకింగ్‌ను కీలకంగా కలిగిన యూనివర్శిల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌ నేడు తమ  ఆర్ధిక ఫలితాలను 2021-22 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం కోసం వెల్లడించింది. ఆర్థిక వ్యవస్ధ కోలుకుంటుండటం చేత ఈ బ్యాంక్‌ శక్తివంతమైన తమ వ్యాపార వృద్ధిని కొనసాగించింది.

 
ఈ బ్యాంక్‌ యొక్క మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, అడ్వాన్స్‌లు) 18.6% ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ వృద్ధి చెంది మార్చి 31, 2022 నాటికి 1.96 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఈ బ్యాంక్‌ 2.63 కోట్ల వినియోగదారులను 5639 బ్యాంక్‌ శాఖల ద్వారా చేరుకుంది. బ్యాంకుకు భారతదేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 34 బ్యాంకింగ్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి.  బంధన్‌ బ్యాంక్‌లో పనిచేస్తోన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 60,211 గా నిలిచింది.

 
ప్రస్తుత ఆర్ధికసంవత్సర నాల్గవ త్రైమాసంలో ఈ బ్యాంక్‌ డిపాజిట్లు గత సంవత్సరం ఇదే త్రైమాసంతో పోలిస్తే 24% వృద్ధి చెందాయి. మొత్తం డిపాజిట్లు ఇప్పుడు 96,331 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ కాలంలో, ఈ బ్యాంక్‌ రిటైల్‌ డిపాజిట్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇది ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 21% పెరగడంతో పాటుగా 74,441 కోట్ల రూపాయలకు చేరింది. కరెంట్‌ ఎక్కౌంట్‌ అండ్‌ సేవింగ్స్‌ ఖాతా (కాసా) బుక్‌ ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 18% వృద్ధి నమోదు చేసింది. కాసా రేషియో ఇప్పుడు మొత్తం డిపాజిట్‌ బుక్‌లో 41.6%గా ఉంది. అడ్వాన్స్‌ల పరంగా చూస్తే ఈ బ్యాంక్‌ 16%వృద్ధి గత సంవత్సంతో పోలిస్తే నమోదు చేసింది. మొత్తం ఆదాయం 99,338 కోట్లకు చేరింది.

 
క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో (సీఏఆర్‌) 20.1% బ్యాంక్‌ యొక్క స్ధిరత్వంకు సూచికగా ఉంటుంది. రెగ్యులేటరీ అవసరాల కంటే ఇది అత్యధికంగా ఉంది. దేశవ్యాప్తంగా తమ వినియోగదారులకు సేవలనందించేందుకు బంధన్‌ బ్యాంక్‌ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా తమ దృష్టిని విస్తరించడంతో పాటుగా తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ఎస్‌ఎంఈ ఋణాలు, బంగారం ఋణాలు, వ్యక్తిగత ఋణాలు మరియు ఆటో ఋణాలకు విస్తరించింది.

 
ఈ ఫలితాలను గురించి చంద్రశేఖర్‌ ఘోష్‌, ఎండీ అండ్‌ సీఈవో మాట్లాడుతూ, ‘‘2022 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసంలో శక్తివంతమైన ప్రదర్శన చేయడం ద్వారా ఈ బ్యాంక్‌ మరోమారు తమ నిలకడ ప్రదర్శించింది. మా వ్యాపార నమూనా పట్ల మా నమ్మకం మరింతగా బలోపేతమైంది. మేము మా వినియోగదారుల నిరంతర మద్దతు, నమ్మకం పట్ల ధన్యవాదములు తెలుపుతున్నాము. ఇవే అంశాలు కోట్లాది మంది భారతీయుల ప్రాధాన్యతా బ్యాంకింగ్‌ భాగస్వామిగా బంధన్‌ బ్యాంక్‌ను నిలిపాయి’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments