Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.4500 కాదు కదా.. పైసా కూడా ఇవ్వలేం.. ఆర్బీఐకు బ్యాంకుల ఫిర్యాదు

భారత రిజర్వు బ్యాంకుకు బ్యాంకులు ఝులక్ ఇచ్చాయి. ఏటీఎం కేంద్రాల ద్వారా రోజుకు రూ.4500 చొప్పున డబ్బులు కాదు కదా పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని బ్యాంకులు తేల్చి చెప్పేశాయి. కారణం.. తమకు సరిపడ నోట్లు

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (11:08 IST)
భారత రిజర్వు బ్యాంకుకు బ్యాంకులు ఝులక్ ఇచ్చాయి. ఏటీఎం కేంద్రాల ద్వారా రోజుకు రూ.4500 చొప్పున డబ్బులు కాదు కదా పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని బ్యాంకులు తేల్చి చెప్పేశాయి. కారణం.. తమకు సరిపడ నోట్లు రావడం లేదని ఆర్బీఐకు బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. 
 
దేశంలో పెద్ద నోట్లు రద్దు ప్రకటన వెలువడి 50 రోజులు గడుస్తున్నా కొత్త రూ.500, రూ.2000 నోట్లు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకులకు చేరలేదు. నోట్ల రద్దుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. డిసెంబరు 26 వరకు ఉన్న పరిస్థితులపై బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి గణాంకాలతోసహా నివేదిక అందజేశాయి. 
 
రిజర్వు బ్యాంకు నుంచి తమకు సరిపడా కొత్త నోట్లు రావడం లేదని అనేక బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. అలాంటపుడు ఏటీఎంల ద్వారా రోజుకు రూ.4500 ఎలా విత్‌డ్రా సాధ్యమని ప్రశ్నించాయి. కేవలం బిహార్‌లో మాత్రమే సరిపడా నోట్లు అందుబాటులో ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా ఏటీఎంల్లో నగదు ఉందని, అవన్నీ పని చేస్తున్నాయని బ్యాంకర్లు పేర్కొన్నారు.
 
కాగా, శుక్రవారం అర్థరాత్రి వేళ ఆర్బీఐ ఓ మోస్తరు శుభవార్త వినిపించింది. ఏటీఎంలలో రూ.2500 ఉన్న నగదు విత్‌డ్రా పరిమితిని ఆదివారం నుంచి రూ.4500లకు పెంచిన విషయం తెల్సిందే. అయితే, విత్‌డ్రా చేసే గరిష్ట పరిమితి రూ.24 వేలను యధాతథంగా ఉంచింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments