Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ - జూలై 5న బాధ్యతల స్వీకరణ

Webdunia
గురువారం, 27 మే 2021 (18:19 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు కొత్త సీఈవో రానున్నారు. ఆయన పేరు ఆండీ జస్సీ. వచ్చే జూలై 5వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెజాన్‌కు సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబుతున్నానని.. ఆండీ జెస్సీ సీఈవోగా వ్యవహరిస్తారని ఫిబ్రవరిలోనే ప్రస్తుత సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలో కొత్త సీఈవోకు సంబంధించిన బుధవారం స్పష్టత వచ్చింది. జూలై 5న అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆండీ జెస్సీ.. 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. 
 
అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో జెస్సీ కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్‌గా ఉన్న ఆయన జులై 5న అమెజాన్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
 
కాగా, జులై 5 తనకు ఎంతో సెంటిమెంట్ అని.. అందుకే ఆ రోజే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు జెఫ్ బెజోస్ తెలిపారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
 
'జూలై 5ను ఎందుకు ఎంపిక చేశానంట, అది నాకు సెంటిమెంట్. ఆ రోజుకు సరిగ్గా 27 ఏళ్ల క్రితం.. అంటే 1994లో అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే జులై 5 నాకు ఎంతో ప్రత్యేకమైనది' అంటూ జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. 
 
జెఫ్ బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా నియామకం కానున్నారు. ఇక బెజోస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్2పై ఆయన మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం అమెజాన్ మరో కీలక ప్రకటన చేసింది.
 
కాగా, 77 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మేందుకు ఈ సంస్థను ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.67 ట్రిలియన్ డాలర్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments