Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లకు మనమొద్దట.. మనకు మాత్రం వాళ్లు కావాలట.. ఇదే అమెరికన్ న్యాయం!

ఒకవైపు పదిలక్షలమందిని దేశం నుంచి తరిమేస్తాం, భారతీయులైనా సరే అక్రమవలసలను వెంటాడి దేశంనుంచి బయటకు తరుముతాం అని అమెరికాధ్యక్షుడు ట్రంప్ గార్దభస్వరంతో రోజూ ఇల్లెక్కి కూస్తుంటాడు. కానీ మనం మాత్రం దేశదేశాలూ తిరిగి మా దేశానికి రండి రండి రండంటూ ఎర్ర తివాచీ

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (03:25 IST)
ఒకవైపు పదిలక్షలమందిని దేశం నుంచి తరిమేస్తాం, భారతీయులైనా సరే అక్రమవలసలను వెంటాడి దేశంనుంచి బయటకు తరుముతాం అని అమెరికాధ్యక్షుడు ట్రంప్ గార్దభస్వరంతో రోజూ ఇల్లెక్కి కూస్తుంటాడు. కానీ మనం మాత్రం దేశదేశాలూ తిరిగి మా దేశానికి రండి రండి రండంటూ ఎర్ర తివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంటాం. అక్కడ ఆ గడ్డపై మనవాళ్ల లేత నెత్తురు విద్వేషం సాక్షిగా పారుతుంటూంది. ఇక్కడ మనవాళ్లు ఆ రక్తపిపాస దేశం దిగ్గజ కంపెనీలకు దాసోహం అవుతూ వారి కరుణాకటాక్ష వీక్షణాలు తగిలితే చాలు  అనుకుంటూ పరవశించిపోతూ ఉంటాం.

అక్కడ కూచిబొట్ల శ్రీనివాస్ శవమై మన దేశానికి పేటికలో వచ్చాడు. ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులతో మన రైతాంగం ఊపిరిని తీయడానికి అమెజాన్  రంగంలోకి దిగుతోంది. మనం అక్కడ రెక్కల కష్టం చేసుకుని కూడా బతకగూడదు. ఇక్కడ మన రెక్కల్ని ముక్కలు చేయడానికి వస్తున్న వాళ్లకు జైకొట్టి మరీ ఆహ్వానిస్తాం. ఇదే న్యాయం. ఘనమైన అమెరికా న్యాయం. 
 
మనవాళ్లు పచ్చగా బతుకుతుంటే కూడా సహించని దేశం నుంచి అమెజాన్ భారీ పెట్టుబడులతో భారత్‌ను ముట్టడించనుంది. మన ఆహార ఉత్పత్తుల రిటైల్ వ్యాపారంపై అమజాన్ కన్ను పడింది. ఫుడ్‌ ఓన్లీ ఔట్‌లెట్స్‌ ఏర్పాటు సహా దేశీయంగా తయారుచేసిన ఆహార ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. అమెజాన్‌ స్థానికంగా తయారైనా లేదా ఉత్పత్తి చేసిన ఫుడ్‌ ప్రొడక్టులను దేశవ్యాప్తంగా ఏ విధానంలోనైనా (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌) కస్టమర్లకు విక్రయించాలని భావిస్తోంది. అంటే సంస్థ ఫుడ్‌ ప్రొడక్టుల రిటైల్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా అమెజాన్‌ తన తొలి గ్రాసరీ స్టోర్‌ను అమెరికాలో ఏర్పాటు చేసింది.
 
ఫుడ్‌ ప్రొడక్టుల రిటైల్‌ వ్యాపారం కోసం అమెజాన్‌ భారత్‌లో కొత్త వెంచర్‌ను (అనుబంధ సంస్థ) ఏర్పాటు చేయనుంది. ఇందులో సింగపూర్‌కు చెందిన అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్‌ కంపెనీకి 99 శాతం వాటా ఉండనుంది. ఇక మిగిలినది అమెజాన్‌.కామ్‌కు (మారిషస్‌) సంబంధించినది. కంపెనీ ఈ వెంచర్‌ ద్వారా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తోంది. ఇది స్థానికంగా తయారుచేసి, ప్యాక్‌ చేసిన ఫుడ్‌ ప్రొడక్ట్‌లను థర్డ్‌ పార్టీ లేదా సొంత ప్రైవేట్‌ లేబుల్స్‌ ద్వారా మార్కెట్‌లో విక్రయించనుంది. వెంచర్‌ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభిస్తే ఫుడ్‌ సప్లై చైన్‌లో మధ్యవర్థుల అవసరం లేకపోవడం, వ్యర్థాలు తగ్గుదల వంటి పలు అంశాల కారణంగా రైతులకు రాబడి పెరిగే అవకాశముంది.
 
ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే అమెజాన్‌ తొలిగా కొన్ని కాన్సెప్ట్‌ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా స్థానికంగా తయారు చేసిన ఫుడ్‌ ప్రొడక్టులను విక్రయించాలని భావిస్తోంది. ‘మేం ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికి అనుమతి కోరాం. లక్ష్యాల కోసం ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. తొలిగా కొన్ని కాన్సెప్ట్‌ స్టోర్లను ఏర్పాటు చేసి, ప్రొడక్టులను విక్రయిస్తాం’ అని ఎ.టి.కార్నే పార్ట్‌నర్‌ అభిషేక్‌ మల్హోత్రా తెలిపారు. ఎంపిక చేసిన ప్రాంతాలు, ఎయిర్‌పోర్ట్స్, మాల్స్‌లో స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో పటిష్టమైన ఫుడ్‌ సప్లై చైన్‌ ఏర్పాటుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ వంటి అంశాలు తమకు ప్రోత్సాహకంగా ఉన్నాయని అమెజాన్‌ ఇండియా పేర్కొంది.
 
అమెజాన్‌ కంపెనీ 2015 నవంబర్‌లోనే రిటైల్‌ స్టోర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇది తొలిగా సీటెల్‌లో బుక్‌స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీని తర్వాత పోర్ట్‌లాండ్, శాన్‌ డియాగో ప్రాంతాల్లో కూడా ఔట్‌లెట్స్‌ను ప్రారంభించింది. ఇది తన తొమ్మిదవ బుక్‌స్టోర్‌ను ఈ ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేయనుంది. అలాగే ఇది తన తొలి గ్రాసరీ స్టోర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో ‘అమెజాన్‌ గో’ పేరుతో సీటెల్‌లోనే ఏర్పాటు చేసింది. దీని సేవలు ఈ ఏడాది నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్నవి. కాగా 2016లో కంపెనీ నికర అమ్మకాలు 27 శాతం వృద్ధితో 136 బిలియన్‌ డాలర్లకి ఎగశాయి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments