Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర‌ప్రకాష్ ఆఫర్ : చెన్నైలో రూ.19 లక్షలకే డబుల్ బెడ్రూం ఫ్లాట్!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:39 IST)
చెన్నైలోని ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ అమరప్రకాష్ రెండు రోజుల పాటు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. నగర శివారు ప్రాంతంలో తాము నిర్మించే బహుళ అంతస్తు ప్రాజెక్టు టెంపుల్ వేవ్స్‌లో డబుల్ బెడ్రూం ఫ్లాట్‌ను రూ.19 లక్షలకే అందించనుంది. వాస్తవానికి ఈ ఫ్లాట్ ధర రూ.29 లక్షలు ఉండగా, దీన్ని రూ.19 లక్షలకు ఆఫర్‌లో అందచేస్తున్నట్టు తెలిపారు. అదీ కూడా ఫిబ్రవరి 28, మార్చి ఒకటో తేదీల్లో బుక్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ ఎండీ ఆదర్శ్ సురానా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 



 
ఈ ఫ్లాట్‌ను 606 చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు చెన్నైవిమానాశ్రయానికి, చెన్నైఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోని క్రోంపేట వద్ద వస్తుందన్నారు. ఇప్పటికే ఫేజ్ 1 బహుళ అంతస్తు భవన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. ఇపుడు కొత్తగా ఫేజ్ 2ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 
 
ఈ టౌన్‌షిప్‌లో సైక్లింగ్‌ ట్రాక్‌, సిమ్మింగ్‌ పూల్‌, బ్యాడ్మింటన్‌, షటిల్‌ కోర్టు, క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్‌, వాలీబాల్‌ కోర్టు తదితర సౌకర్యాలతో పాటు జైన్‌ పబ్లిక్‌ స్కూల్‌ను కూడా నెలకొల్పుతున్నట్టు పేర్కొన్నారు. ఈ టౌన్‌షిప్‌ను 18.5 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టినట్టు ఆయన వివరించారు. ఈ ఆఫర్‌ కోసం తమ మార్జిన్‌ను గణనీయంగా తగ్గించుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments