Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేత.. డబ్బులు లేక ఏటీఎంల వెక్కిరింత

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత రిజర్వు బ్యాంకు విధించిన నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు సోమవారంతో తొలగిపోయాయి. అయితే, అనేక బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వలు లేక ప్రజలు మాత్రం ఎప్పటిలా ఇబ్బందులు పడ్డారు

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (14:40 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత రిజర్వు బ్యాంకు విధించిన నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు సోమవారంతో తొలగిపోయాయి. అయితే, అనేక బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వలు లేక ప్రజలు మాత్రం ఎప్పటిలా ఇబ్బందులు పడ్డారు. 
 
గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ కొరత నెలకొంది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద కరెన్సీ ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పలు పరిమితులు విధించింది. విడతల వారీగా వీటిని ఎత్తివేస్తామని ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా ఫిబ్రవరి 28న సేవింగ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి రూ.24 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా తాజాగా విత్‌డ్రాపై అన్ని ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. నగదు లేక ఏటీఎంలు వెక్కిరిస్తుండడంతో వినియోగదారులకు సాంత్వన దొరికినట్టుగా కనిపించడం లేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments