Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా చేతికి ఎయిరిండియా: 68 ఏళ్ల తర్వాత మళ్లీ..?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (23:21 IST)
జనవరి 27వ తేదీన ఎయిరిండియా పూర్తిగా టాటా పరం కానుంది. జనవరి 27వ తేదీ నుంచి ఎయిరిండియా నిర్వహణ టాటాలు అందుకోవడం జరుగుతుందని ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాది సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా తెలియచేశారని తెలుస్తోంది. 
 
ఎయిరిండియాతో రాకతో టాటా గ్రూప్ లోకి మూడో విమానాయన బ్రాండ్ వచ్చినట్లవుతుంది. ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 08వ తేదీన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 
 
ఇకపోతే.. ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను పారిశ్రామిక దిగ్గజం జేఆర్డీ టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసింది. దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది. 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments