Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రూపాయికే విమాన టిక్కెట్!

కేవలం ఒక్క రూపాయికే విమాన టికెట్టా..? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును. ఇది నిజమే. దేశీయ తొలి బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌డెక్కన్‌ మళ్లీ వైమానిక మార్కెట్లోకి రానుంది.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (11:53 IST)
కేవలం ఒక్క రూపాయికే విమాన టికెట్టా..? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును. ఇది నిజమే. దేశీయ తొలి బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌డెక్కన్‌ మళ్లీ వైమానిక మార్కెట్లోకి రానుంది. త్వరలోనే ఈ ఎయిర్‌లైన్‌ తిరిగి సేవలను ప్రారంభించనుందట. అయితే ప్రచారంలో భాగంగా కొందరు లక్కీ ప్రయాణికులకు రూపాయికే విమాన టికెట్‌ ఇవ్వనుందట.
 
నిజానికి ఎయిర్ డెక్కన్ సేవలు గత 2003లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో విలీనమయ్యాయి. ఈ సంస్థ ఆర్థిక కష్టాల్లో కూరుకోవడంతో గత 2012లో మూసివేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎయిర్‌లైన్‌ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుందట. ఆ కంపెనీ అధిపతి జీఆర్ గోపీనాథ్ తాజాగా ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఈ నెలాఖరులో ముంబై - నాసిక్‌ల మధ్య తొలి విమాన సేవలు ప్రారంభించనుంది. ఆతర్వాత ఢిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్‌ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సేవల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఒక్క రూపాయికే టిక్కెట్ ఆఫర్‌ను ప్రకటించినట్టు ఆయన తెలిపారు. అయితే, ఈ ఆఫర్ కేవలం లక్కీ ప్రయాణికులు మాత్రమేనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో కిల్లర్ పార్ట్ 1

విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ ఆవిష్కరించిన డియర్ కృష్ణ ట్రైలర్

'పుష్ప-3'పై కీలక అప్‌డేట్!!

ఓరేయ్ ‘ఎలుగుబంటి’.. గేట్ తీయ్ : హీరో మనోజ్ (Video)

'జైలర్‌'కు సీక్వెల్ - గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments