Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ - డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు.. తగ్గిన ధరలు

Webdunia
ఆదివారం, 22 మే 2022 (11:38 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను కొంతమేరకు తగ్గించింది. భగ్గుమంటున్న పెట్రోల్ ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసింది. ఇందులోభాగంగా పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.  
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయివున్నాయి. అనేక రాష్ట్రాల్లో సెంచరీ క్రాస్ అయింది. పెట్రోల్ లీటర్ రూ.120 వరకు ఉండగా, డీజిల్ లీటర్ రూ.105 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తద్వారా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 మేర తగ్గనుందని, లీటర్ డీజిల్ ధర రూ.7 మేర తగ్గనుందని వివరించారు. 
 
ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. తద్వారా లీటర్‌పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఊరట కలగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments