Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో భారీగా పెరగనున్న ఏసీ ధరలు!

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (12:43 IST)
కరోనా కష్టకాలం తర్వాత దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజల్ ధరలు సెంచరీ కొట్టాయి. ఈ ధరల ప్రభావం అన్నింటిపై పడింది. దీంతో ప్రతి ఒక్క వస్తువు ధర విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఏసీ ధరలు మరోమారు పెరగనున్నాయి. ఇప్పటికే వీటి ధరలు ఒకసారి పెరిగాయి. ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ఈ ఏసీ త‌యారీ సంస్థ‌లు వాటి త‌యారీలో ఉప‌యోగించే మెటల్‌, కంప్రెసర్ రేట్ల పెరుగుద‌ల‌ను సాకుగా చూపుతున్నాయి.
 
క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గించేందుకు ఐటీతోపాటు ప‌లు కార్పొరేట్ సంస్థ‌లు దాదాపు త‌మ సిబ్బంది మొత్తానికి వ‌ర్క్ ఫ్రం హోం ఆప్ష‌న్ ఇచ్చాయి. వేస‌విలో వేడి త‌గ్గించుకోవ‌డానికి ఏసీలు కొనాల‌ని త‌ల‌పోస్తున్న ఐటీ నిపుణుల‌కు.. ఇత‌ర వ‌ర్గాల ఉద్యోగుల‌కు ముడి స‌రుకుల ఖ‌ర్చు పెరుగుద‌ల సాకుతో ఏసీ త‌యారీ సంస్థ‌లు వాటి ధ‌ర‌లు పెంచి షాక్ ఇవ్వ‌నున్నా‌యి. 
 
దాదాపు అన్ని ఏసీ కంపెనీలూ 5 నుంచి 8 శాతం మేర ధరలు పెంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6-8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్‌ వెల్లడించింది. రిఫ్రిజిరేటర్ల ధరలు సైతం 3-4 శాతం పెంచనున్నట్లు పానాసోనిక్‌ దక్షిణాసియా విభాగం అధ్య‌క్షుడు కమ్ సీఈవో మనీశ్‌ శర్మ తెలిపారు. 
 
ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్‌ తెలిపింది. టాటా స‌న్స్ గ్రూప్ అనుబంధ‌ వోల్టాస్ సంస్థ ఇప్పటికే ఏసీల ధరలు పెంచేసింది. ముడి సరకుల‌ ధరలు పెర‌గ‌డం వ‌ల్లే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని వోల్టాస్ పేర్కొంది. ఇప్పటికే వివిధ శ్రేణి ఏసీలపై 5-8 శాతం ధరలను పెంచేసిన మ‌రో సంస్థ బ్లూస్టార్‌.. మ‌రో సారి వ‌చ్చే నెల‌లో 3 శాతం మేర ధరలు పెంచేందుకు సన్నద్ధం అవుతోంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏసీల విక్ర‌యాలు 30 శాతం  మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు బ్లూస్టార్‌ ఎండీ త్యాగరాజన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments