Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యుత్తమ నైట్‌లైఫ్ అనుభవాన్ని భారతదేశానికి తీసుకురానున్న అబ్జల్యూట్- సన్‌బర్న్

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (20:58 IST)
ప్రపంచపు 10 మ్యూజిక్ ఫెస్టివల్, ఆసియా ప్రీమియర్ EDM ఫెస్టివల్‌గా ప్రసిద్ధి చెందిన సన్‌బర్న్‌‌తో తన మూడేళ్ల అనుబంధానికి కొనసాగింపుగా, దేశంలోని యువతకు సంతోషకరమైన అనుభవాలు అందించడం కోసం అబ్జల్యూట్ గ్లాస్‌వేర్ మరోసారి సంసిద్ధమైంది. ఆరుగురు గ్లోబల్ ఆర్టిస్టులు మరియు ప్రపంచ ప్రసిద్ధ డిజెలతో 10కి పైగా నగరాల్లో నిర్వహించనున్న 24 ప్రదర్శనలతో పాటుగా గోవాలో ఈ ఏడాది డిసెంబర్ 28 నుండి 31 వరకు జరిగే ప్రపంచ-ప్రసిద్ధ సంగీత ఉత్సవానికి సహ-సమర్పక భాగస్వామిగా అబ్జల్యూట్ గ్లాస్‌వేర్ స్ఫూర్తి నింపనుంది. భారతదేశంలోని నైట్ లైఫ్ భవిష్యత్తును సొంతం చేసుకోవాలని ఈ బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరులో ప్రారంభించిన సన్‌బర్న్ అరేనాస్ అనేది ఈ లక్ష్యంలో ఎక్కువ భాగాన్ని సాధించే ఉద్దేశం కలిగినది.

మరింత సమ్మిళిత, నిష్పాక్షిక పర్యావరణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో, అబ్జల్యూట్‌తో భాగస్వామ్యం కలిగిన ఈ సన్‌బర్న్ ఎడిషన్‌లో మహిళలు- విభిన్న వర్ణాల వ్యక్తులతో సహా విభిన్నమైన DJలు వేదిక మీదకు రానున్నారు. ప్రధానంగా, విభిన్న నేపథ్యాల వ్యక్తులను ఒకచోటుకి తీసుకురావడంతో పాటు సంగీతమనే విశ్వ భాష ద్వారా, ఐక్యతా రాగం ఆలపించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది.

ఈ ఏడాది, అగ్రశ్రేణి విజువల్ డిజైన్లు ప్రదర్శించడానికి, సంగీత ఔత్సాహికుల కోసం ఆకర్షణీయ అనుభవాలు సృష్టించడానికి ఆధునిక-కాలపు సాంకేతికత ఉపయోగించుకునేందుకు అబ్జల్యూట్ సిద్ధమైంది. అలెస్సో, టిమ్మీ ట్రంపెట్, షార్లెట్ డి విట్టే, అర్మిన్ వాన్ బ్యూరెన్, దిమిత్రి వేగాస్ మరియు లైక్ మైక్ లాంటి సంగీత దిగ్గజాలతో ప్రత్యక్ష ప్రదర్శనలతో పాటు, స్వదేశీ కళకారులు, నలుగురు ప్రఖ్యాత ఇన్‌ఫ్లూయన్సర్లు వేదిక పంచుకోనున్న భారతదేశపు ఈ అతిపెద్ద సంగీత కార్యక్రమం మరియు అందులోని షోలతో వీక్షకులు అతిగొప్ప, లోతైన అబ్జల్యూట్ అనుభవం చవిచూడనున్నారు.

ఈ భాగస్వామ్యం గురించి పెర్నోడ్ రికార్డ్ ఇండియాలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కి మార్కెటింగ్ హెడ్‌గా ఉన్న పుల్కిత్ మోడీ మాట్లాడుతూ, "ఈ సంవత్సరపు అతిపెద్దదైన మరియు అనేకమంది ఎదురుచూస్తున్న మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో సన్‌బర్న్ ఒకటిగా ఉంటోంది. అలాంటి కార్యక్రమం వెనుక ఉండడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. యువత కోసం మరింత ప్రగతిశీలమైన మరియు సమ్మిళిత, బేషజాలు లేని ప్రపంచం సృష్టించాలనే తన దార్శనికతలో భాగంగా, ఈ సంవత్సరం సన్‌బర్న్‌తో కొన్ని అసాధారణ అనుభవాలను అబ్జల్యూట్ గ్లాస్‌వేర్ సిద్ధం చేసింది. ఈ సాంస్కృతిక సంభాషణల్లో ముందంజలో ఉన్నందుకు, నైట్ లైఫ్ భవిష్యత్తును మరియు స్వేచ్ఛా వ్యక్తీకరణ ప్రపంచాన్ని నిర్మిస్తున్నందుకు  మేము గర్విస్తున్నాము.”<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments