Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ ‌- పాన్‌ లింకు తప్పనిసరి... అనుసంధానంపై మరో వెసులుబాటు

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ నంబరు అనుసంధానంపై ఆదాయపు పన్ను విభాగం మరో అవకాశం కలిగించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అనుసంధానం చేసుకొనే అవకాశం ఉండగా, తాజాగా కాగితంపై దరఖాస్తు చేసుకు

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (13:30 IST)
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)తో ఆధార్‌ నంబరు అనుసంధానంపై ఆదాయపు పన్ను విభాగం మరో అవకాశం కలిగించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అనుసంధానం చేసుకొనే అవకాశం ఉండగా, తాజాగా కాగితంపై దరఖాస్తు చేసుకునే వీలును కూడా కలిగించింది. 
 
ఈ దరఖాస్తు ఒక పేజీ మాత్రమే ఉంటుంది. ఆధార్‌, పాన్‌లలో నమోదైన పేరు స్పెల్లింగ్‌ల్లో తేడా ఉంటే ఆ విషయాన్ని పేర్కొనాలి. వీటిని సంబంధిత కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
 
ఈ దరఖాస్తులో ఆధార్‌ సంఖ్య, శాశ్వత ఖాతా సంఖ్య, ఆధార్‌లో నమోదైన పేరు, పాన్‌లో నమోదైన పేరు, ఈ ఆధార్‌ సంఖ్యను ఇతర ‘పాన్‌’తో అనుసంధానం చేయడానికి సమర్పించలేదంటూ స్వీయ ధ్రువీకరణ అనే కాలమ్స్ ఉంటాయి. ఇందులో పేర్కొన్నది తప్ప మరో ‘పాన్‌’ లేదంటూ ఇంకో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. 
 
అంతేకాకుండా, పన్ను చెల్లింపుదారులు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా ఆధార్‌-పాన్‌ అనుసంధానం చేయవచ్చు. ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా చేసుకునే అవకాశం ఉంది. ‘పాన్‌’ సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొనే సౌకర్యం కూడా కల్పించారు. పాన్‌ దరఖాస్తులు స్వీకరించే సేవా కేంద్రాల్లోనూ అనుసంధానం చేస్తారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments