Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI ఖాతా దారులకి శుభవార్త : నెలాఖరులోగా సమర్పించేందుకు అవకాశం

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (15:22 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీని ఈనెలాఖరు వరకు పొడగించింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్‌, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేన‌ని, లేదంటే సేవ‌ల‌ను నిలిపేస్తామ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. 
 
అదేసమయంలో శుక్ర‌వారం చాలా మంది క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంక్ నుంచి సందేశాలు అందాయి. కొంద‌రు త‌మ ఖాతాల్లో భారీగా ఉన్న డ‌బ్బును హోల్ట్‌లో పెట్టిన‌ట్లు బ్యాంక్ నుంచి వ‌చ్చిన మెసేజ్ చూసి ఆందోళ‌న చెందారు. 
 
అయితే బ్యాంక్‌లో పాన్‌, ఆధార్ కార్డ్‌తో స‌హా కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్‌, ఆధార్‌ను ఎందుకు లింక్ చేయాలో కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.
 
ఇక పాన్ కార్డుతో ఆధార్‌ను ఆన్‌లైన్‌లో లింకు చేసేందుకు www.incometaxindiaefilling.gov.in లింకును కూడా ఎస్‌బీఐ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో షేర్ చేసింది. పాన్‌, ఆధార్ అనుసంధానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments