కనుమరుగవుతున్న గులాబీ రంగు కాగితం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (14:27 IST)
దేశవ్యాప్తంగా 2వేల రూపాయల నోటు చలామణీ బాగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలం వరకు ఎక్కువగా కనిపించే 2 వేల నోటు ఉన్నట్లుండి కనుమరుగవుతోంది. బ్యాంకులు, ఏటీఎంలలో కూడా 100, 500 రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో పెద్ద నోట్లు కావాలని అడిగినా కూడా లేవనే సమాధానం వస్తోంది. 
 
అయితే ఎన్నికలు జరుగుతుండటంతో వాటిని ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయకుండా ఆపినట్లు కొందరు భావిస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు కూడా తమ బ్యాంకుల్లో వచ్చే డిపాజిట్లలో 2 వేల నోట్లు చాలా తక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇంకా వ్యాపారులు కూడా తమ కస్టమర్లు ఇదివరకు ఎక్కువగా 2 వేల నోట్లనే ఇచ్చేవారని కానీ ఇప్పుడు అందరూ 500 నోట్లనే ఇస్తున్నారని అంటున్నారు.
 
కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బును కొందరు బడా నాయకులు పెద్ద నోట్లుగా మార్చుకుని దాచుకుంటున్నారని కొందరు బ్యాంకర్ల వాదన. గతేడాది చలామణీలో ఉన్న నోట్లలో 2 వేల నోట్లు 37 శాతం ఉండగా ఈ ఏడాది దాని శాతం బాగా పడిపోయిందని తెలుస్తోంది. ఏదేమైనా సామాన్యులు మాత్రం 2 వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా ఉందని, అది చలామణీలో లేకపోవడమే మంచిదని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

NBK112: నారా లోకేష్ అతిథిగా నందమూరి బాలకృష్ణ 112 చిత్రం

Tej Sajja: హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్ : సాయి దుర్గ తేజ్

Allani Sridhar: పిల్లల సినిమాలులేవనే బాధ వుంది;.ఏఐ టెక్నాలజీ 24 క్రాఫ్ట్స్‌ని కిల్‌ చేయదు : అల్లాణి శ్రీధర్‌

తర్వాతి కథనం
Show comments