Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు మాల్యా కార్లు వేలం... ఇప్పుడు నీరవ్ కార్ల వంతు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:16 IST)
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోడీపై మరో దెబ్బ పడింది. నీరవ్ మోడీకి చెందిన కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వేలం వేయనుంది. ఆయనకు చెందిన 13 కార్లను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 18వ తేదీన వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పెయింటింగ్స్‌ని వేలం వేయగా రూ.54.84 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
 
ఏప్రిల్‌ 18న నీరవ్‌కు చెందిన అత్యంత విలాస వంతమైన కార్లను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకానికి ఉంచనున్నారు. రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌, పనామెరా, టొయోటా ఫార్చునర్‌, ఒక ఇన్నోవా, రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు, మూడు హోండా కార్లు తదితర కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు వీటిలో ఉన్నాయి. కార్లు అన్నీ మంచి కండీషన్‌లోనే ఉండటంతో ఇవి మంచి ధర పలుకుతాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ వేలాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంఎస్‌టీసీ)కు కాంట్రాక్టు ఇచ్చింది.
 
వేలంలో కార్లను కొనాలనుకునే వారు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. కార్లు కొనాలనుకునే వారు కార్లను పరిశీలించవచ్చు కానీ టెస్ట్‌ డ్రైవ్‌ చేయడానికి కుదరదు. కార్ల అంచనా ధర, తయారీ సంవత్సరం, కారు మోడల్‌, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్లో ఉంచనున్నారు. వేలం పూర్తయిన తర్వాత కార్ల రిజిస్ట్రేషన్‌ కోసం కొంత గడువు ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments